Devayani: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు తగ్గించారు కానీ ఈయన ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. ఇక పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాలో లిస్టు తీస్తే అందులో సుస్వాగతం సినిమా మొదట్లోనే ఉంటుంది. సుస్వాగతం సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమాలో హీరోయిన్గా దేవయాని నటించిన విషయం తెలిసిందే.
తమిళంలో అప్పటికే హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన దేవయాని అనంతరం తెలుగులోకి ఎంట్రీస్తూ పవన్ కళ్యాణ్ తో కలిసి సుస్వాగతం సినిమాలో నటించారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన దేవయాని పలు సినిమాలలో నటించారు అయితే పెద్దగా సక్సెస్ మాత్రం రాలేదు. ఇక ఈమె తల్లి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం తెలుగు తమిళ భాష చిత్రాలలో ఈమె మదర్ రోల్స్ చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా హీరో సిద్ధార్థ నటించిన 3bhk సినిమాలో హీరో తల్లి పాత్రలో నటిస్తున్నారు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాదులో లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అనంతరం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవయానికి పవన్ కళ్యాణ్ కు ఎందుకు సినిమాలు చేయలేదని ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు దేవయాని స్పందిస్తూ.. తాను చేస్తున్న ప్రతి ఒక్క సినిమా కూడా కథపరంగా ఆలోచించి మంచి సెలెక్టివ్ సినిమాలను మాత్రమే చేస్తున్నాను అలా కథలను ఎంపిక చేసుకోవడం వల్ల తిరిగి పవన్ కళ్యాణ్ గారితో నేను నటించలేకపోయానని తెలిపారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో అవకాశం వస్తే కథ మంచిగా ఉంటే నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ రాజకీయాల పరంగా బిజీ అయ్యారు. ఇలా రాజకీయాలలో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించారు ఒకవేళ సినిమాలు చేసిన హీరోయిన్ దేవయానికి అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.