లాస్యను ఆట పట్టించిన శృతి అంకిత…. తులసితో కలిసి షాపింగ్ వెళ్ళిన సామ్రాట్!

కుటుంబం నుంచి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవితంలో పోరాడుతూ ఉన్నటువంటి ఒక మహిళ కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే..మొదటి నెల జీతం అందుకున్న తులసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే కుటుంబం బరువు మోయాలి అంటే బలం ఉండాలి. లెక్కలు రాయడానికి తెలివి ఉండాలి. కుటుంబ బాధ్యతలు తీసుకోవాలంటే వారి చదువులు కాదు లోకజ్ఞానం ఉండాలని తులసి చెబుతుంది.ఇక తులసికి వచ్చిన శాలరీని అంచనా వేసి అన్ని ఖర్చుల పోను మీకు నెలకు 5000 మాత్రమే మిగులుతాయి అంటూ సామ్రాట్ చెప్పగా లేదు 20,000 మిగులుతాయని తులసి చెబుతుంది.

దీంతో తులసి సామ్రాట్ ఇద్దరు కూడా ఖర్చు గురించి మాట్లాడుతూ డబ్బును ఆదా చేయాలంటే కేవలం ఆడది మాత్రమే చేయగలరు. మగవాడి సంపాదన ఆధారంగా డబ్బును ఒక మహిళ మాత్రమే ఆదా చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.మరి మిగిలిన ఈ డబ్బులను ఏం చేస్తారు అంటూ సామ్రాట్ ప్రశ్నించగా నా పిల్లల కోసం ఉపయోగిస్తాను అని సమాధానం చెబుతుంది.ప్రస్తుతం వాళ్లు ఇక్కడ లేరు కదా అని సామ్రాట్ అడగగా తన తండ్రి దగ్గర ఉన్న ఆయనకు ఉద్యోగం లేదు కదా అంటూ చెబుతుంది ఇక తులసితో కలిసే సామ్రాట్ కూడా షాపింగ్ వెళ్లడానికి సిద్ధమవుతారు.

మరోవైపు శృతి అంకిత వంట చేస్తూ ఉండగా లాస్య అక్కడికి వెళుతుంది.లాస్య రావడం చూసిన అంకిత మీరు ఈ ఇంట్లో చూడకూడని స్థలం ఏదైనా ఉంది అంటే అది కిచెన్ మాత్రమేనని వెటకారంగా మాట్లాడుతుంది. మీ బెడ్ రూమ్ పైన ఉంది పొరపాటున ఇక్కడికి వచ్చారేమో అని అంటూ అంకిత కూడా లాస్యను ఆటపట్టిస్తూ మాట్లాడుతారు. ఇక ఈరోజు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తానే వంట చేయాలని అనుకుంటున్నాను అంటూ అలా వస్తే చెప్పడంతో దానికేం భాగ్యం వంట చెయ్యి అంటూ ఎవరెవరికి ఏం కావాలో అన్ని చెబుతారు.

అదే సమయంలో భాగ్య కూడా అక్కడికి వస్తుంది.ప్రస్తుతం ఈ ఇంట్లో ప్రజెంట్ సిచువేషన్ ఎలా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది.ఇక అంకిత శృతి చెప్పిన లిస్టు చూసి నలుగురికి 40 రకాల వంటలు వండాలా ఇది ఇలా లేక రెస్టారెంట్ నేనేం చేస్తే అదే తినాలని అంటుంది.అలా కుదరదని చెప్పడంతో ఈ వంట సంగతి ఏంటో మీరే చూసుకోండి మిగతా పనులు నేను చూసుకుంటానని బయటకు వస్తుంది.

మరోవైపు తులసి సామ్రాట్ ఇద్దరు షాపింగ్ కోసం వెళుతూ ఉండగా ఈరోజు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అంటూ సామ్రాట్ చెప్పడంతో మీరు ఏసీ కారు వదిలి వచ్చారు అందుకే ఎండలు కనపడుతున్నాయి అని తులసి చెబుతుంది.బస్సు రాగానే చాలామంది పరుగులు పెడుతూ దోసుకుంటూ బస్సు ఎక్కుతారు అయితే సామ్రాట్ చేత మాత్రం కాదు. దీంతో కొన్ని బస్సులు వెళ్లిపోయిన సామ్రాట్ బస్సు ఎక్కకపోతే నావల్ల కాదండి అని చెబుతాడు. దీంతో తులసి మీరు క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లిపోండి అని చెప్పగా లేదు లేదు నేను కూడా నీతోనే వస్తాను అంటూ కష్టపడి బస్సు ఎక్కుతాడు.