జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్లుగా పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా పాపులర్ అయిన ఆది ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో లో కూడా టీం లీడర్ గా సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ షో లో ఆది డాన్సర్లు జడ్జిలు అని తేడా లేకుండా అందరి మీద తన పంచులు , సెటైర్లు వేస్తూ రెచ్చిపోతుంటాడు. ముఖ్యంగా జడ్జ్ గా వ్యవహరిస్తున్న హీరోయిన్ పూర్ణ గురించి ఎప్పుడు సెటైర్లు వేస్తూ ఉంటాడు. అయితే ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్ లో మాత్రం హైపర్ ఆదిని పూర్ణ దారుణంగా అవమానించింది.
అసలు విషయం ఏమిటంటే… కొంత కాలంగా ఢీ షో కి దూరంగా ఉంటున్న పూర్ణ పెళ్లి తర్వాత మళ్లీ ఇటీవల ఢీ షో లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఎపిసోడ్ లో డాన్సర్ శ్వేత-హైపర్ ఆదికి పోటీ పెట్టారు. నీతోనే డాన్స్ టు నైట్ పాటకు డాన్స్ చేయాలని చెప్పి మొదట శ్వేతా పెర్ఫార్మ్ చేసింది. తర్వాత హైపర్ ఆది డాన్స్ చేశాడు. ఆ తర్వాత యాంకర్ ప్రదీప్ జడ్జిమెంట్ అడిగాడు. దీంతో జడ్జి పూర్ణ శ్వేతా బాగా చేసిందని చెప్పింది. పూర్ణ కామెంట్ కి హైపర్ ఆది వెంటనే రియాక్ట్ అయ్యి ఫస్ట్ టైం మీ జడ్జిమెంట్ నాకు నచ్చలేదు. మీది రాంగ్ జడ్జిమెంట్ అని చేతిలో ఉన్న బాటిల్ విసిరేసి స్టేజ్ పై నుండి క్రిందకు వచ్చేశాడు.
దీంతో పూర్ణ ఫీల్ అయ్యి నువ్వు అలా బిహేవ్ చేయకూడదు అన్నారు. హైపర్ ఆది నాకు యాక్టింగ్ రాదు, డాన్స్ రాదు అని చెప్పాడు . దీంతో నీకు సిగ్గుంటే ఇక్కడ నుండి వెళ్ళు… సిగ్గు లేదంటే ఇక్కడే ఉండు అంటూ ఆది ని అందరిముందూ దారుణంగా అవమానిస్తూ కామెంట్స్ చేసింది. దీంతో ఆది రియక్ట్ అవుతూ..నాకు సిగ్గు లేదు, సిగ్గు రాదు. నా సిగ్గు ఎలా ఉంటుందో భవిష్యత్ లో చూస్తావని హైపర్ ఆది పూర్ణకు కౌంటర్ ఇచ్చాడు. మళ్ళీ పూర్ణ ఆదిని నోరుమూసుకో అంది. నాకు నోరు లేదు అంటూ ఆది వెక్కిరించాడు. ఇలా ఇద్దరిమద్య మాటల యుద్ధం జరిగింది.