Poorna: నటి పూర్ణ ఇంట్లో ఘనంగా బక్రీద్ వేడుకలు.. స్పెషల్ అట్రాక్షన్ గా కొడుకు.. ఫోటోస్ వైరల్!

Poorna: తెలుగు సినీ నటి హీరోయిన్ పూర్ణ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో పరిశ్రమలలో హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది పూర్ణ. ఒకవైపు వెబ్ సిరీస్ లలో షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూనే మరోవైపు రెండు తెరపై కూడా అలరిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పెళ్లి అయినా కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది పూర్ణ. ఇకపోతే పూర్ణ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు షోస్ చేస్తూ బిజీగా ఉన్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రార్తనలు చేస్తూ ఘనంగా నిర్వహించారు. ఈ బక్రీద్ వేడుకల్లో సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు సైతం భాగమయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నటి పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం ఇంట్లో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను నటి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది పూర్ణ.

ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పూర్ణ కుమారుడు చూస్తుండగానే చాలా పెద్దవాడయ్యాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా పూర్ణ దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో పెళ్లి పీటలెక్కంది. 2022 జూన్ 12న దుబాయిలోనే తన పెళ్లి జరిగినట్లు ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది పూర్ణ. ఆ తర్వాత 2023 ఏప్రిల్‌ లో హమ్దాన్ అసిఫ్ అలీ అనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది పూర్ణ.