అనసూయ నటించిన సినిమాకి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్.. ఎన్ని కోట్లో తెలుసా?

అందాల యాంకర్ అనసూయ గురించి తెలియని వారంటూ ఉండరు. జబర్థస్త్ ద్వారా యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ జబర్థస్త్ లో గ్లామర్ షో తో ప్రేక్షకులను ఆకట్టుకుని యాంకర్ గా గుర్తింపు పొందింది. దీంతో ఇతర చానల్స్ లో ప్రసారమవుతున్న టీవీ షోలో లో కూడా యాంకరింగ్ చేసే అవకాశాలు అందుకొని ఛానల్ తో సంబంధం లేకుండా అన్ని చానల్స్ లో యాంకర్ గా సందడి చేసింది. ఇలా యాంకర్ గా ఫేమస్ అయిన అనసూయకి సినిమాలలో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. క్షణం, రంగస్థలం వంటి సినిమాల ద్వారా నటిగా మంచి గుర్తింపు పొందింది.

దీంతో సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం అనసూయ చేతిలో అరడజను కి పైగా సినిమాలు ఉన్నాయి. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటూ తన ఫాలోయింగ్ మరింత రెట్టింపు చేసుకుంటోంది. అయితే కొన్ని సందర్భాలలో అనసూయ చేసే వ్యాఖ్యల వల్ల వివాదాల్లో నిలుస్తుంది. అయినప్పటికీ తనగురించి వచ్చే ట్రోల్స్ గురించి పట్టించుకోకుండా తనని ట్రోల్ చేసేవారికి చుక్కలు చూపిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అనసూయ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనసూయ ఇలా సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజిగా ఉంది.

ఇదిలా ఉండగా అనసూయ నటించి “అరి” సినిమా ఓటిటి హక్కులకు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. “అరి”సినిమాని డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయడానికి ఆహా ఏకంగా 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అనసూయతో పాటు వైవా హర్ష, ఆమని, సాయికుమార్ వంటి ప్రముఖులు నటించడంతో ఈ సినిమాకి ఆహా 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కాకుండా ఈ సినిమా ఒక వైవిధ్యమైన కథతో రూపొందిందని.. జీవితంలో ఎలా బతకకూడదో.. ఈ సినిమాలో చూపించారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అనసూయ ఎయిర్ హోస్టెస్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.