Ajith Kumar: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి మనందరికి తెలిసిందే. ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అంధించి మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు. ఆయన మ్యూజిక్ కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ కూడా ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒకవార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే.. ఇళయరాజా ఫిర్యాదు కారణంగా నెట్‌ఫ్లిక్స్ నుంచి అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని తొలగించారు.
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుమతి లేకుండా తన పాటలను ఉపయోగించారంటూ ఇళయరాజా కోర్టులో పిటిషన్ వేశారు. కాపీరైట్ చట్టానికి ఇది విరుద్దమని, ఆ పాటలను తొలగించడమే కాకుండా ఉపయోగించినందుకుగానూ తనకు పరిహారం కూడా ఇవ్వాలని ఇళయరాజా తన పిర్యాదులో కోరారు. దీనిపై విచారణ జరిపిన మద్రాసు కోర్టు ఇళయరాజా పాటలను సినిమాలో ప్రదర్శించొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని తొలగించింది.
పాటలను తొలగించి మళ్లీ సినిమాను అందుబాటులోకి తీసుకొస్తారా లేదా మొత్తానికి స్ట్రీమింగ్ చేయకుండా వదిలేస్తారో చూడాలి మరి. ప్రస్తుతం ఈ వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితేఈ వివాదం గురించి చిత్ర నిర్మాత రవి గతంలో మాట్లాడుతూ.. ఇళయరాజా పాటలకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నాము. నిబంధనలకు అనుగుణంగానే పాటలను ఉపయోగించాము అని తెలిపారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ లో థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ. 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది మే 8 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.
Ajith Kumar: ఇళయరాజా ఫిర్యాదుతో నెట్‌ఫ్లిక్స్ నుంచి అజిత్ మూవీ తొలగింపు.. అసలేం జరిగిందంటే!
