లాస్య పై కోప్పడిన నందు…. అందరికీ గిఫ్టులు తీసుకొచ్చిన తులసి!

బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే…లాస్య కుటుంబ సభ్యులందరిని నమ్మించడం కోసం ముసలి కన్నీళ్లు కారుస్తూ ఇంటి పేపర్లు తీసుకొచ్చి పరంధామయ్య కాళ్ళ దగ్గర పెడుతుంది. అది చూసిన ప్రేమ్ అందితే జుట్టు లేదంటే కాళ్లు ఆస్తి పత్రాలు నీ చేతిలోకి వచ్చిన తర్వాత ఇంట్లో వారందరినీ నీ గుపిట్లో పెట్టుకోవాలని ఆలోచించావు ఆ ప్లాన్ కాస్త రివర్స్ అయింది. అందుకే ఈ ముసలి కన్నీళ్లు కారుస్తున్నావ్ అంటూ మాట్లాడుతారు.

నేను ఎలా చెప్తే మీరు నమ్ముతారు నేను నిజంగానే మారిపోయాను అంటూ లాస్య నాటకాలు ఆడుతుంది. ఇక నా ప్రాణం తీసుకుంటే మీరు నమ్ముతారా అంటూ లాస్య కత్తి తీసుకొని చేయి కోసుకోబోతుండగా పరంధామయ్య వద్దమ్మా.. ఒక మనిషి చనిపోతుంటే చూస్తూ ఉండే అంత కసాయి వాళ్ళం కాదు అంటూ చెప్పారు.నీ మనసులో ఏమున్నా కానీ ఈ ఇంటి కోడలుగా నువ్వు ఏడిస్తే ఇంటికి మంచిది కాదని చెబుతారు. నువ్వు చస్తానంటే అయ్యో అనకుండా జాలితో తప్పనిసరి పరిస్థితులలో తాతయ్య మిమ్మల్ని కోడలుగా ఒప్పుకున్నారు అంటూ ప్రేమ్ మాట్లాడతారు.

మరోవైపు తులసి సామ్రాట్ షాపింగ్ చేసి ఆ సామాన్లన్నీ మోసుకొని చాలా అలసిపోతారు..ఇల్లు రాగానే ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఇంట్లోకి వెళ్లి రిలాక్స్ అవుతూ ఈ ఛాలెంజ్ లో నేను గెలిచాను. అయినా మీ ఆడవాళ్లు చాలా గొప్ప అండి ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ తనని పొగుడుతాడు. మరోవైపు లాస్య ఇంట్లో ఎవరు కూడా తనని నమ్మడం లేదని భాగ్య దగ్గర తన బాధంతా బయటపడుతుంది. దీంతో భాగ్య నువ్వు ఇల్లు రిజెక్ట్ చేసిన విషయం బావగారికి తెలిస్తే బావ చాలా సంతోషపడతారు అంటూ సలహా ఇస్తుంది.

మరుసటి రోజు ఉదయం లాస్య కాఫీ తీసుకొని నందు దగ్గరికి వెళ్లగా ఆయన మాత్రం లాస్య చేసిన పనికి తనపై కోప్పడుతూ తనని అనరాని మాటలన్నీ అంటాడు. అదే సమయంలోనే తులసి ఇంటికి రావడంతో దివ్య వెల్లి తనని హగ్ చేసుకుంటుంది. ఇక ఇంట్లో తన పిల్లలందరికీ తులసి గిఫ్టులు తీసుకురావడంతో ఆ గిఫ్ట్స్ అన్ని కూడా వాళ్లకి ఇస్తూ ఉంటుంది. ఇక చెప్పిన విధంగానే తులసి తన ఇంటికి వెళ్లడంతో అనసూయ సంతోష పడుతుంది.