ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ సరికొత్త ట్విస్టులతో ప్రతిరోజు ప్రసారమవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంది. ఇకపోతే ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే.. తులసి నిద్ర లేవగానే లాస్య తనపై ప్రేమ ఉన్నట్టు యాక్టింగ్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నారా రాగి జావా తేవన కాళ్లు పట్టానా అంటూ తెగ ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది. మరోవైపు పరంధామయ్య కావాలనే బత్తాయి పండ్లను కిందకు పడేయడంతో లాస్య నేను తీసేస్తాను మామయ్య అంటుంది. ఇక ఆ పండ్లు బాగాలేవమ్మా అని పరంధామయ్య చెప్పడంతో బానే ఉన్నాయి కదా అంటూ మాట్లాడుతుంది
ఇలా కుటుంబ సభ్యులందరూ ఇలా ప్రవర్తించడంతో వారందరూ కలిసిపోయారని కావాలనే తనని దూరం పెడుతున్నారని లాస్య అర్థం చేసుకుంది. అంతలోపు తులసి నుంచి ఫోన్ రావడంతో అనసూయ ఫోన్ లిఫ్ట్ చేయగా ఎలా ఉంది అత్తయ్య మీకు అని అడుగుతుంది. నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాము ఒకసారి ఇంటికి రావచ్చు కదా తులసి అని అడుగుతుంది. మీకు ఎలా ఉంది అని అడగ బాగుంది,కాస్త నీరసంగా ఉంది అని సమాధానం చెప్పడంతో మీ అత్తయ్యకు నీరసంగా ఉంటేనే బాగుంటుంది అని పరంధామయ్య జోకులు వేస్తాడు.
మరోవైపు నందు తన తండ్రికి కాళ్లు పడుతూ ఉంటారు.ఇక హాని తులసి ఆంటీ ఏంటి ఇక్కడికి రాకుండా ఉన్నారని సామ్రాట్ నీ అడగగా నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా డిస్టర్బ్ చేయకూడదని ఇక్కడికి రావడం లేదని చెబుతాడు.అంతలోపే తులసి అక్కడికి రావడంతో హనీ నీపై బెంగ పెట్టుకుందని చెబుతాడు అలాగే ఇక్కడికి రమ్మన్నారు సామ్రాట్ గారు ఏంటి అని అడగగా మీరు మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేసి ఉద్యోగంలో చేరి కూడా నెల అయింది. మీకు ఇంకా ఇప్పటివరకు జీతం కూడా ఇవ్వలేదని అని చెబుతాడు.
అందుకే తాను సాలరీ ఇవ్వడం కోసమే పిలిచానని అయితే నా జీవితంలో నా చెల్లెలకు ఎంత ప్రాధాన్యత ఇస్తానో మీకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాను. అందుకే అందరిలా మొదటి జీతం బ్యాంకులో వేయకుండా హనీ చేతుల మీదుగా మీకు ఇప్పిద్దామని ఇక్కడికి మిమ్మల్ని రమ్మన్నాను అని చెప్పి హనీ చేతుల మీదుగా తనకు చెక్ ఇప్పించారు.ఇక మొదటి జీతం వచ్చింది ప్లాన్స్ ఏంటి అడగ్గా ఏముంది ఇంటి ఖర్చులు అవి ఇవి అని తులసి చెబుతుంది. మరోవైపు ఇంట్లో సరుకులు అయిపోవడంతో ఏమేం కావాలో లిస్ట్ తయారుచేసి తీసుకువస్తారు అంకిత శృతి.
ఆంటీ ఉన్నపుడు ఇవన్నీ ఆంటీ చూసుకునే వారు ఇప్పుడు ఆంటీ లేరు కనుక మేము లిస్ట్ తయారు చేశామని నందుకి ఇవ్వడంతో వెంటనే లాస్య వచ్చి నందుకి ఇస్తే నందు ఏం చేస్తాడు . ఉద్యోగం లేదు డబ్బులు లేవు అంటూ నందుని మాటలతో చులకనగా చేస్తుంది. అదే సమయంలోనే ప్రేమ్ అభి ఆ లిస్టును తమ చేతుల్లోకి తీసుకొని మీరేం చేస్తారు అని లాస్య అడగగా ఈ ఇంటి బాధ్యతలు నాన్న చూసుకోకపోతే ఆయన కొడుకులుగా మేము చూసుకోవాలి మేం తెస్తామంటూ చెబుతారు. ఇలా కుటుంబ సభ్యులందరూ ఐకమత్యం కావడంతో పరంధామయ్య ఎత్తు సంతోషం వ్యక్తం చేస్తూ అభి ప్రేమ్ ఇద్దరిని గట్టిగా హత్తుకుంటారు.