శౌర్యను ఇంద్రుడికే ఇచ్చేసిన కార్తీక్…. సౌర్య ఆలోచనల నుంచి బయటపడని దీప!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్లో ఏం జరిగింది అనే విషయాన్నికి వస్తే…త్వరలోనే తన అత్తయ్య మామయ్యలను చూస్తాం అనుకున్న దీప స్పృహ తప్పి పడిపోవడంతో తనని తిరిగి హాస్పిటల్ తీసుకెళ్తాడు కార్తీక్. హాస్పిటల్లో దీపకు మెలకువ రాగా ఎందుకు డాక్టర్ బాబు మనం ఇక్కడ ఉన్నామని ప్రశ్నిస్తుంది.నువ్వు ఇంటికి వెళ్లే లోగా కళ్ళు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్ తీసుకొచ్చానని చెప్పగా కాస్త నీళ్లు కొడితే సరిపోయేది కదా అక్కడ అత్తయ్య మామయ్య వాళ్ళని చూసే వాళ్ళం మరి ఇక్కడికి వచ్చి డాక్టర్లు నర్సులని చూస్తున్నాం ఇప్పుడే ఇంటికి వెళ్దాం పదండి డాక్టర్ బాబు అంటుంది.

వెంటనే మనం హైదరాబాద్ వెళ్లిపోదాం పదండి అని చెప్పగా లేదు మనం సంగారెడ్డిలోనే ఉంటున్నామని కార్తీక్ చెప్పగా ఎందుకు అంటూ దీప ప్రశ్నిస్తుంది అమ్మ వాళ్ళు మనల్ని చూడటం కోసం ఇక్కడికే వచ్చారు అనడంతో తాను ఇక్కడికి తీసుకు వచ్చానని చెబుతాడు. మరోవైపు ఇంద్రుడు చంద్రమ్మ సౌర్యను పంపించాలంటే బాధపడుతూ ఉంటారు. ఇక సౌర్య అక్కడికి రావడంతో చంద్రమ్మ తనకి అన్నం తిని పెడుతూ బాధపడుతూ ఉంటుంది. ఇక కార్తీక్ దీపను తీసుకొని వెళ్తూ సౌందర్యవాళ్ళు ఉండే ఇంటిని చూపిస్తారు. దీప ఎంతో సంతోషపడుతుంది అయితే కారులో కార్తీక్ దీపా వెళుతుండగా కార్తీక్ ఇంద్రుడిని చూసి కార్ ఆపి తనని చేయి పట్టుకొని పక్కకు లాక్కెళ్తాడు.

ఇన్ని రోజులు మా సౌర్యను నీ దగ్గర పెట్టుకొని నాటకాలు ఆడావు మమ్మల్ని అక్కడికి ఇక్కడికి తిప్పావు కదా అంటూ కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.అదే సమయంలో ఇంద్రుడు పాపని మీకు ఇవ్వడం కోసమే మొత్తం వెతికాను మీరు కనిపించలేదు. అందుకే అమ్మగారికి అప్పచెప్పుదామని ఇక్కడికి వచ్చేసాను అయ్యగారు మమ్మల్ని క్షమించండి అంటూ ఇంద్రుడు కోరగా అప్పుడు కార్తీక్ శౌర్యను అమ్మవారికి మాకు ఇవ్వాల్సిన పనిలేదు మీ దగ్గర పెట్టుకోండి ఇప్పుడు ఇంతకన్నా నేనేం చెప్పలేను అని చెప్పి మేము కూడా సంగారెడ్డి లోనే ఉంటున్నామని తన ఫోన్ నెంబర్ ఇస్తాడు.

కార్తీక్ ఇలాగా సౌర్యను తన వద్ద పెట్టుకోమని చెప్పడంతో ఇంద్రుడు సంతోషంగా ఇంటికి వెళ్తాడు అప్పుడు చంద్రమ్మ ఏంటి గండ వాళ్ళ అమ్మ నాన్నలు దొరికారా అని చెప్పగా లేదు చంద్రమ్మ జ్వాలను మన దగ్గరే ఉంచుకోమని చెప్పారని చెప్పడంతో చంద్రమ్మ సంతోషపడుతుంది. అయితే ఈమె ఇక్కడే ఉంటుందని ఎక్కువ ఆశలు పెట్టుకోకు చంద్రమ్మ అని ఇంద్రుడు చెబుతాడు.మరోవైపు కార్తీక్ దీప కోసం కాఫీ తీసుకురాగా ఏంటి మీరు కాఫీ తీసుకువచ్చారు అని దీప చెప్పడంతో ఇకపై నువ్వు వంటలు చేయాల్సిన పని లేదు నువ్వు వంటలు నాకు నేర్పించు నేనే చేస్తాను అని కార్తీక్ చెప్పగా నేనుండగా మీరు వంట చేయడం ఏంటి డాక్టర్ బాబు అని చెబుతుంది. నీకు ఇప్పుడే ఆపరేషన్ అయింది నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి కార్తీక్ హాస్పిటల్ కి వెళ్తాడు. అయినప్పటికీ దీప మాత్రం శౌర్య ధ్యాసలోనే ఉండి తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది.