రజనీకాంత్ కి గుడి కట్టి పూజలు చేస్తున్న వీరాభిమాని.. ఇంటికి పిలిచి సత్కరించిన తలైవా!

అభిమానులు తలైవా, సూపర్ స్టార్ అంటూ రకరకాల బిరుదులతో పిలవబడే రజనీకాంత్ ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులకు ఆరాధ్య దైవం. అలాంటి రజనీకాంత్ తాజాగా ఓ అభిమాని నుంచి భారీ నివాళి అందుకున్నాడు. రజనీకాంత్ అభిమాని ఒకరు తమిళనాడులోని మధురైలో తన ఇంటి ఆవరణలో తన అభిమాన నటుడు అయిన రజనీకాంత్ కి గుడి కట్టించి ఆ గుడిలో నిత్యం పూజలు చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న రజినీకాంత్ ఆ అభిమానిని ఇంటికి పిలిచి సత్కరించారు.

ఆ నటుడు ఎవరో, రజనీకాంత్ అతనికి ఏమిచ్చి సత్కరించారో తెలుసుకుందాం… కొత్తగా ఏది చేస్తే వార్తల్లోకి ఎక్కుతామా అని వెతికి మరీ ఆపనితో వైరల్ అవుతున్నారు. తాజాగా తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమాని ఒకరు సరిగ్గా ఇలాంటి పనితోనే ప్రస్తుతం హైలెట్ అవుతున్నాడు. సూపర్ స్టార్ అభిమాని.. ఏకంగా తలైవాకు గుడి కట్టేశాడు. గుడి కట్టడంతో వదిలేయలేదు.. ఏకంగా రోజూ.. పూజలు చేస్తూ.. అభిశేకాలు అర్చనలతో హడావిడి చేస్తున్నారు.

తమిళనాడులోని మధురైకు చెందిన కార్తీక్. తలైవా రజనీ అంటే తనకు చాలా ఇష్టమని చెబుతున్నాడు కార్తీక్​. ‘రజనీకాంత్ విగ్రహం బరువు 250 కిలోలు. నాకు సూపర్​స్టార్ రజనీ దేవుడితో సమానం. ఆయనపై గౌరవం, ప్రేమతో నా ఇంట్లోనే గుడి కట్టాను. నా కూతురు అనసూయ కూడా రజనీ అభిమానే. గుడిలో దేవుడిని ఎలా పూజిస్తామో అదే విధంగా రజనీకాంత్‌ విగ్రహాన్ని కూడా నేను, నా కూతురు పూజిస్తాం’అని కార్తీక్​ చెప్పారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్ అభిమానిని చెన్నై లోని పోయస్ గార్డెన్ లో ఉన్న తన నివాసానికి ఆహ్వానించారు. కార్తీక్ కుటుంబ సభ్యులను సత్కరించే వారికి తన ఇల్లు మొత్తం చూపించి వారితో ఫోటోలు దిగి వారికి సాయిబాబా విగ్రహాన్ని కానుకగా ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు రజనీకాంత్ ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే సదరు కార్తీక్ అనే వ్యక్తి మాజీ సైనికుడు కావడం గమనార్హం.