తులసి ఇంట్లో భారీ సెలబ్రేషన్స్…. కాలు జారి కింద పడిన శృతి…. ఆవేశంలో నందు!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే…సామ్రాట్ తులసి ఇంట్లో కాఫీ పెడతానంటే చేతులు కాల్చుకుంటాడు. అయితే తులసి మాత్రం మీరు చేసే అల్లరి పనులు చూస్తుంటే నాకు ప్రేమ్ గుర్తొస్తున్నాడు అంటుంది. అంతలోపే ప్రేమ్ అంకిత అభి శృతి అందరూ కూడా అక్కడికి రావడంతో తులసి సంతోషపడుతుంది. అక్కడ నువ్వు సంతోషంగా లేవు అందుకే మేము ఇక్కడికి వచ్చే సెలబ్రేషన్స్ చేసుకొని సంతోషంగా గడుపుదాం అనుకున్నాము అని చెప్పడంతో తులసి చాలా సంతోషపడుతుంది.

మీ నాన్నకు చెప్పే వచ్చారు కదా అని తులసి అడగడంతో నీకు అతను మర్యాద ఇవ్వనపుడు మేము ఎందుకు తనకు మర్యాద ఇవ్వాలి అందుకే చెప్పకుండా వచ్చామని ప్రేమ్ అంటాడు.ప్రేమ్ అలా అనకూడదని చెప్పినప్పటికీ అవన్నీ పట్టించుకోడు ఇక సామ్రాట్ మాత్రం మీరంతా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనే కదా మీరు కాసేపు కూర్చోండి అంటూ వారికి తెలియకుండా సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేస్తాడు. మరోవైపు ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో లాస్య ఎక్కడికి వెళ్లారని అనుకుంటుంది. ఇందాక గొడవ జరిగింది కదా ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళారేమోలే వస్తారు అంటూ నందు చెబుతాడు.

ఇంట్లో మనం ఇంటి బాధ్యతలని చూసుకుంటున్నాం కనీసం మనకొక మాట చెప్పాలని కూడా లేదా ఇంట్లో అత్తయ్య మామయ్య తప్ప మిగతా ఎవరూ లేరు అంటూ లాస్య చిరాకు పడుతుంది. మరోవైపు సామ్రాట్ పార్టీ మొత్తం అరేంజ్ చేసి సర్ప్రైజ్ ఇస్తాడు. అనంతరం ప్రేమ్ శృతి ఇద్దరు కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.మరోవైపులాస్య మాత్రం ఎక్కడికి వెళ్లి ఉంటారు అని కంగారుపడుతుంది. అంతలోపు పరంధామయ్య అక్కడికి రావడంతో మామయ్య కాఫీ కావాలా అని అడుగుతుంది.ఇంట్లో ఎవరూ లేరు తీసుకురమ్మంటారా అనడంతో ఇంట్లో ఎవరూ లేరా అని పరంధామయ్య అంటాడు.

కాఫీ గురించి ఏం చెప్పలేదు అని లాస్య అనడంతో ఆల్రెడీ ఒక కోటా అయిపోయింది ఇక నాకు వద్దమ్మా అని చెప్పి తన ఫోన్ అక్కడే పెట్టి వెళ్ళిపోతాడు. దీంతో లాస్య తన ఫోన్ నుంచి దివ్యకు ఫోన్ చేస్తుంది. దివ్య ఫోన్ లిఫ్ట్ చేసి వాట్ యంగ్ మాన్ నువ్వు రమ్మంటే రాలేదు ఇక్కడ మేము మామ్ ఇంట్లో పార్టీలో ఎంజాయ్ చేస్తున్నాము బై బై అంటూ ఫోన్ పెట్టేస్తుంది. దీంతో లాస్య మండిపోయి నందుకు వచ్చి అసలు విషయం చెబుతుంది. దీంతో నందు లాస్య ఇద్దరు కోపంగా అక్కడికి బయలుదేరుతారు.

ఇలా పార్టీలో అందరూ కలిసి డాన్సులు చేస్తూ ఉండగా శృతి ఒక్కసారిగా కాలుజారి కింద పడుతుంది. దీంతో అందరూ ఆందోళన చెంది తనని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. అంతలోనే నందు అభికి ఫోన్ చేసి ఎక్కడున్నారు అనడంతో హాస్పిటల్లో అని చెప్పగా నందు సీరియస్ గా హాస్పిటల్ కి వెళ్తాడు అయితే కింద పడటం వల్ల శృతికి అబార్షన్ అవుతుందా ఆ నింద తులసిపై పడుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.