బిగ్ బాస్ సీజన్ 6 రోజు రోజుకి చాలా రసవత్తరంగా మారుతోంది. కంటెస్టెంట్ లందరూ కూడా ఒకరితో ఒకరు గట్టిగా పోటీ ఇస్తూ టైటిల్ దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్లు ఫిజికల్ గా గేమ్ ఆడి టైటిల్ దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే మరి కొందరు మాత్రం బుద్ధిబలంతో డిన్నర్ గా నిలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా గీతు బిగ్ బాస్ టైటిల్ దక్కించుకోవాలని రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడింది. టైటిల్ కోసం ఇతర కంటెస్టెంట్లతో అవసరం లేకుండా కేవలం టైటిల్ మీదే ఫోకస్ పెట్టి గేమ్ ఆడింది. కానీ గీతు ఇలా టైటిల్ దక్కించుకోవడం కోసం ఎదుటివారి వీక్నేస్ తో ఆడుకోవటంతో ప్రేక్షకులు ఆమెను హౌస్ నుండి బయటకు పంపించేశారు.
తాజాగా జరిగిన తొమ్మిదవ వారం ఎలిమినేషన్స్ లో గీతు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది. గీతు యువర్ ఎలిమినేటెడ్ అని నాగార్జున చెప్పగానే ఆ మాట వినలేక గీతు చెవులు మూసుకుంది. నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా అవుదాం అనుకుంటే అప్పుడే పంపించేస్తున్నారు ఏంటి బిగ్ బాస్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. బయట నాకు స్నేహితుడు ఎవరూ లేరు. ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకంటూ కొందరు స్నేహితులు అయ్యారు. ముఖ్యంగా ఆదిరెడ్డి నాకు బిగ్ బాస్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అంటూ ఎమోషనల్ అయింది. నాకు ఇక్కడి నుండి వెళ్ళాలని లేదు ..నన్ను పంపించకండి బిగ్ బాస్ అంటూ బోరున ఏడ్చింది.
అయితే గీతు ఇలా కన్నీళ్లు పెట్టుకోవడంతో రేవంత్,
ఫైమా, ఆదిరెడ్డి, సత్య, శ్రీహాన్ కంటతడి పెట్టుకున్నారు. గీతు ఇంట్లో తనకి ఇష్టమైన ప్లేస్ కి వెళ్లి కాసేపు కూర్చొని చాలా ఎమోషనల్ అయ్యింది. ఇక హౌస్ నుండి స్టేజీ మీదకు వచ్చిన గీతు కి నాగర్జున ఒక టాస్క్ ఇచ్చాడు. హౌస్ లో గేమ్ మేకర్స్ ఎవరు? గేమ్ బ్రేకర్స్ ఎవరు? అని ప్రశ్నించాడు. ఆది, రేవంత్, ఫైమా, సత్య, శ్రీహన్ వల్ల గేమ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
ఇనయ, వాసంతి, కీర్తి, రోహిత్, మెరీనా, రాజ్ ల గేమ్ తక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది అంటూ సమధానం చెప్పింది. ఇక ఆది మాట్లాడుతూ .. 24 గంటలు టైటిల్ దక్కించుకోవాలని కలలు కన్న గీతు ని ఇలా బయట చూడటం చాలా బాధగా ఉంది అంటూ ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు. ఇక రేవంత్ కూడా గీత కోసం పాట పాడగానే .. నన్ను ఇక్కడి నుంచి పంపించకండి అంటూ మరొకసారి గీతు కన్నీళ్లు పెట్టుకుంది.