బుల్లితెరపై అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే… డాక్టర్ బాబు ఇంద్రుడికి డబ్బులు ఇవ్వడం చూసి దీప బాధతో ఇంటికి వెళ్తుంది.మరోవైపు చంద్రమ్మ శౌర్య దగ్గరికి వచ్చి తనని స్కూల్ కి పంపిస్తానని చెప్పడంతో శౌర్య మాత్రం నేను స్కూల్ కి వెళ్తా అమ్మానాన్నలను ఎవరు వెతుకుతారు పిన్ని అని చెబుతుంది.మొన్నటిని స్కూల్ కి వెళ్ళమని చెప్పాను కదా ఆ రోజే ప్రిన్సిపాల్ తో మాట్లాడడం ఇంటి నుంచి పరీక్షలు రాయమని చెప్పారు. నువ్వు కనుక మీ ఇంట్లో ఉంటే పెద్ద స్కూల్ లోచదివే దానివి అని మాట్లాడటంతో ఎందుకు మీరు వేరు నేను వేరని మాట్లాడుతారు అలా మాట్లాడకండి అంటూ సౌర్య కోప్పడుతుంది.
అంతలోగా చంద్రుడు అక్కడికి వచ్చి జ్వాలమ్మనువ్వు ఈ పరీక్షలు చేయించుకోవాలి మొన్న నీకు దెబ్బ తగిలింది కదా అంటూ రిసిప్ట్ ఇవ్వడంతో అందులో రౌడీ అనీ ఉండడం చూసి శౌర్య ఇంద్రుడిని నిలదీస్తుంది.ఇందులో రౌడీ అని రాసి ఉంది అలా పిలిచేదినని కేవలం మా నాన్న మాత్రమే ఈ అక్షరాలు కూడా నాన్న చేతిరాత లాగే ఉంది నిజం చెప్పు బాబాయ్ అంటూ నిలదీస్తుంది.ఇది చారుశీల డాక్టరమ్మ రాసిచ్చారు. నువ్వు మొన్న తనకు మా నాన్న రౌడీ అని పిలుస్తారని చెప్పావు కదా అందుకే ఆమె రాసిందని ఇంద్రుడు తప్పించుకుంటాడు.
మరోవైపు దీప ఆ ఇంద్రుడు తన నుంచి తప్పించుకున్నటువంటి సంఘటనలను గుర్తుచేసుకొని బాధపడుతుంది. అంతలోగా అక్కడికి చారుశీల కార్తీక్ ఇద్దరు నవ్వుకుంటూ వస్తారు.దీంతో కార్తీక్ ఆ ఇంద్రుడు దొరికినట్టే దొరికి పారిపోయాడు చారుశీల అనడంతో ఎక్కడెక్కడ వెతికారండి అని దీప అడుగుతుంది. నిన్న మనం తనని చూసిన హోటల్లో కూడా వెతికారా అంటే అవును అని కార్తీక్ సమాధానం చెబుతాడు. నేను కూడా అక్కడ వెతికాను నా డాక్టర్ బాబు ఎదురుగా కూర్చున్నటువంటి ఇంద్రుడికి తన డాక్టర్ బాబు డబ్బులు ఇవ్వడం కూడా చూశాను.
ఒకటికి రెండుసార్లు నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా అని చూశాను కానీ నా డాక్టర్ బాబు నన్ను మోసం చేస్తున్నారు అని చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు.దీంతో కార్తీక్ నాకు నిజం తెలిసిపోయింది అసలు నిజం చెప్పండి ఎందుకు నా బిడ్డను నన్ను వేరు చేస్తున్నారు అని తన కాలర్ పట్టుకుని అడగడంతో డాక్టర్ బాబు అవును నేనే ఇన్ని రోజులు వాళ్ళని కలవకుండా మోసం చేశాను. ఎందుకంటే నేను ఎక్కువ రోజులు బ్రతకను కనుక అని షాకింగ్ న్యూస్ చెబుతాడు.
కార్తీక్ అలా చెప్పడంతో చారుశీల కూడా షాక్ అవుతుంది.దీప సైతం అసలు కొన్ని రోజులు బ్రతకడం ఏంటి డాక్టర్ బాబు ఏమైంది అంటూ చెప్పడంతో నేను మరి కొద్ది రోజుల్లో చనిపోబోతున్నానని అబద్ధం చెబుతాడు.అందుకే నిన్ను మాత్రమే కాదు నేను కూడా వాళ్ళందరికీ దూరంగా ఉంటున్నాను వాళ్లు నేను లేనని బ్రమలో బతుకుతున్నారు అలాగే ఉండనివ్వు అంటూ కార్తీక్ చెప్పడంతో దీప గుండెలు పగిలేలా ఏడుస్తుంది ఎలాగైనా నా భర్తను కాపాడండి చారుశీల అంటూ ఏడుస్తుంది.
మరోవైపు సౌందర్య వాళ్ళు అంజిని పిలిచి మనం దీప ఉన్న ఊరికే వెళ్తున్నాం అక్కడ ఒక మంచి ఇల్లు చూడు ఈసారి ఆ ఊరి నుంచి వెనక్కి రావడం అంటే దీప కార్తీక్ లను తీసుకొని వెనక్కి రావడమే అని అక్కడికి బయలుదేరుతుంది. ఇక దీప మనం వాళ్లకి దూరంగా ఉండాలి వాళ్లకంట పడుకుంటూ కానీ మనం వారిని చూడొచ్చు కదా నన్ను శౌర్య దగ్గరకు తీసుకెళ్లండి దూరం నుంచి తనని చూస్తాను అంటూ కట్టుబడటంతో కార్తీక్ తనని తీసుకెళ్తాడు కారులో నుంచి దీప శౌర్యను చూస్తుంది.సౌర్యను చూసిన దీప అక్కడికి వెళ్తుందా లేదా అనేది తర్వాత ఎపిసోడ్లో తెలియాల్సి ఉంది.