రిషి వసుధార పెళ్లి ఆపుతానని జగతికి వార్నింగ్ దేవయాని….. ప్రేమలో లీనమయిపోయిన రిషిధార!

గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణం సంపాదించుకుంటుంది. గత ఎపిసోడ్లో భాగంగా రీషి వసుధారణ తీసుకువచ్చి తను నాకు కాబోయే భార్య అంటూ అందరిముందు చెప్పడంతో జగతి మహేంద్ర దంపతులు సంతోషం వ్యక్తం చేస్తారు. దేవయాని మాత్రం షాక్ అవుతూనే ఉంటుంది.నేటి ఎపిసోడ్లో భాగంగా జగతి రిషి చెప్పిన మాటలను తలుచుకొని ఎంతో సంతోషపడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన దేవయాని ఏంటి జగతి రిషి మాటలు విని చాలా సంతోషంగా ఉన్నావు ఎగిరి గంతులేస్తుంటావు అని అనుకున్నాను ఇలా మౌనంగా కూర్చున్నావ్ ఏంటి అని అడుగుతుంది.

జగతి ఏదో చెప్పబోతుండగా నువ్వు మాట్లాడకు నేను మాత్రమే మాట్లాడతాను అంటూ దేవయాని మాట్లాడుతుంది. రిషి వసుధాలను పెళ్లి చేసుకుంటానని చెప్పగానే సంతోషపడుతున్నారు అయితే నా అనుమతి లేకుండా రిషి ఏ పని చేయడు. అదేవిధంగా రిషి వసుధారల పెళ్లి జరగనివ్వను అంటూ దేవయాని చెప్పడంతో జగతి షాక్ అవుతుంది. నాకు ఇష్టం లేనటువంటి వసుధారను రిషి పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను అంటూ దేవయాని షాకింగ్ కామెంట్స్ చేస్తుంది.

ఈ మాటలు విన్నటువంటి జగతి మీకు రిషి వసుధార పెళ్లి చేసుకోవడంఇష్టం లేదనే విషయాన్ని నాకెందుకు చెబుతున్నారు. ఇదే విషయాన్ని వెళ్లి రీషికి చెప్పండి అని షాక్ ఇస్తుంది. ఏంటి జగతి రివర్స్ గేమ్ ఆడుతున్నావా.. నేను చెప్పానంటే అది జరగదు ఎలాగైనా వీరీ పెళ్లి చెడగొడతానని అక్కడి నుంచి వెళ్తుంది.తను వెళ్లేలోపు మహేంద్ర లోపలికి వస్తారు ఏంటి ఏమైంది జగతి అని అడగడంతో అక్కయ్య రిషి వసుదారుల పెళ్లి ఆపుతానని వార్నింగ్ ఇస్తోంది అంటూ సమాధానం చెబుతుంది.మరోవైపు దేవయాని పడుకోకుండా ఫోన్ చూస్తూ ఉండగా పనింద్ర పడుకోకుండా ఫోన్ చూడటం ఏంటి అని సీరియస్ అవుతాడు.

రిషి తన గదిలో కూర్చుని వసుధార గురించి అందరి ముందు అలా చెప్పడం వల్ల తను ఏమైనా ఇబ్బంది పడిందేమోనని తనకు మెసేజ్ చేస్తాడు. అందుకు వసుధార ఇబ్బంది పడటం కాదు సార్ మనసు ఉప్పొంగిపోయింది అంటూ సమాధానం చెబుతుంది. ఒకసారి ఇక్కడికి రావచ్చు కదా లేక నేను అక్కడికి రానా అంటే బాగుండదేమో సార్ అంటూ వసుదారా చెబుతుంది.ఎందుకు బాగుండదు అని రిషి చెప్పడంతో ఇలా ఇద్దరం ఒకే గదిలో ఉండడం బాగుండదు అని ఇద్దరు బయటకు వెళ్లి మాట్లాడుతూ ఉంటారు.

ఇక దేవయాని అదే సమయంలో అక్కడికి రావడంతో వారిద్దరిని చూసి కుళ్లుకుంటుంది.ఇక దేవయాని వారి వద్దకు వెళ్లి రిషి కంటే తెలియదు నీకు కూడా తెలియదా వసుధార ఇక్కడ ఇలా ఉండకూడదని అంటూ వసుధారను తిడుతుంది.దాంతో వసుధార మేడం చలిలో మీరు ఎక్కువగా బయట తిరగకూడదు లోపలికి వెళ్ళండి అంటూ తనకు రివర్స్ కౌంటర్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు వసుధారతో సంబంధం కలుపుకోవడానికి వెళ్లాలి అనుకుంటూ ఉండగా సంబంధం కలుపుకోవడానికి కాదు తెంపుకోవడానికి వెళ్తారని దేవయాని మనసులో అనుకుంటుంది. ఇంతలోనే వసుధార బావకి ఫోన్ చేసి పెళ్లి ఆపడానికి ఏదో పెద్ద ప్లాన్ చేసిందని తెలుస్తోంది అయితే ఈ ప్లాన్ మొత్తం మహేంద్ర విని షాక్ అవుతారు.