బయటపడిన చారుశీల అసలు రంగు…. కార్తీక్ పై అనుమానం పెంచుకున్న పండరి!

బుల్లితెర ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు ఎంతో ఆసక్తిగా మారుతుంది ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే…..సౌందర్య శౌర్యను తీసుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ శౌర్య మాత్రం రానని తెగేసి చెబుతుంది. అమ్మ నాన్నలు చనిపోవడానికి కారణమైన హిమ ఉన్నచోటకి నేను రాను. అమ్మ నాన్నలు చనిపోవడానికి ఇదే కారణం.ఒకవేళ అమ్మానాన్న బ్రతికున్న కూడా నేను హిమను క్షమించను అంటూ మాట్లాడుతుంది.మీ అమ్మానాన్నలు ఆక్సిడెంట్ లోనే చనిపోయారు నువ్వు నాతో పాటు రా అంటూ సౌందర్య బలవంతం చేయగా ఇంద్రుడు చారుశీల మాత్రం బ్రతికున్నారన్న నమ్మకంతోనే మీరు వెతుకుతున్నారు కదా అలా మాట్లాడకండి అని అడ్డుపడతారు.

బలవంతంగా సౌందర్య శౌర్యను తీసుకెళ్తూ ఉండగా ఇంద్రుడు తన కాళ్లపై పడి సౌర్యమ్మను మనం వదిలేయండి అమ్మ అనడంతో సరే అని సౌందర్య వెళ్ళిపోతుంది. మరోవైపు దీప తన రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్లి తన డాక్టర్ అన్నయ్యకు చూపించగా ఆయన రిపోర్ట్స్ చూసి ఎందుకు కంగారు పడుతున్నావు దీప ఇది నీకు ఆపరేషన్ చేస్తున్న రిపోర్ట్స్ నీకు ఎలాంటి పెద్ద ప్రమాదం లేదు ఇంతమంది డాక్టర్స్ ఉండగా నీకు ఏమైనా కానిస్తామా అని ధైర్యం చెబుతాడు.కార్తీక్ వచ్చి దీప ఎక్కడికెళ్ళింది అనడంతో పండరి గుడికి వెళ్ళింది అని చెబుతాడు అంతలో దీప గురించి కార్తీక్ ఆందోళన చెందుతుంటాడు.

సరే పండరి నువ్వు వెళ్లి దీపను ఇంటికి తీసుకురా నాకు అర్జెంట్ పనుందని కార్తీక్ వెళ్లడంతో మీకు పాపను వెతకడం ఇష్టం లేదా అంటూ పండరి కార్తీక్ ను అనుమానిస్తుంది. ఆరోజు ఇంద్రుడు చంద్రమ్మ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి మీరే కారణం అని నాకు అనుమానం వచ్చింది అంటూ కార్తీక్ ను నిలదీయగా తను మాత్రం మాటలు మారుస్తూ వంటలు గురించి అడుగుతూ ఉంటారు. దీంతో పండరి నేనేం మాట్లాడుతున్నారు మీరేం సమాధానం చెబుతున్నారు బాబు అంటూ ప్రశ్నిస్తుంది.

మరోవైపు చారుశీల దీపా కార్తీక్ లను విడగొట్టడానికి నేను ఇక్కడికి వచ్చాను నేను ఆ మోనిత మనిషినే. అందుకే రిపోర్ట్స్ మార్చిదీప కార్తిక్లను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటూ తన నిజ స్వరూపం బయటపెడుతుంది మరోవైపు కార్తీక్ ఇంద్రుడిని హోటల్ దగ్గరికి రమ్మని చెప్పి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో దీపా అక్కడికి వస్తుంది.దీపను చూసిన కార్తిక కంగారు పడతాడు అంతలోపు చంద్రుడు కూడా అక్కడికి రావడంతో దీప తనని పట్టుకోవాలని వెంబడిస్తుంది అయితే కార్తీక్ తనని కావాలనే వదిలేసి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటాడు. ఆ తర్వాత కార్తీకదీపం ఇంటికి వెళ్ళమని చెబుతాడు.