హీరోయిన్ మీనాతో ముద్దు విషయం బయట పెట్టిన బాలకృష్ణ…?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలలో నటించడమే కాకుండా ప్రస్తుతం ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ రియాలిటీ షోలో కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆహలో ప్రసారమైన మొదటి సీజన్ మంచి హిట్ అవటంతో ఇటీవల అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ప్రారంభించారు. మొదటి సీజన్ కన్నా ఈ రెండవ సీజన్ మరింత ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటూ అత్యధిక వ్యూస్ సాధిస్తూ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

ఇలా దేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ షో గా నిలిచింది. ఇదిలా ఉండగా ఈ రెండవ సీజన్లో మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సందడి చేశారు. మొదటి ఎపిసోడ్ కి ఊహించని స్థాయిలో వ్యూస్ సాధించి ఈ రియాలిటీ షో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక రెండవ ఎపిసోడ్ లో యువ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ తో కలిసి బాలకృష్ణ చేసిన సందడి కూడా బాగా ఆకట్టుకుంది. ఇక ఇటీవల మూడవ ఎపిసోడ్ కూడా ప్రసారం అయింది. ఈ ఎపిసోడ్ లో శర్వానంద్, అడవి శేషు గెస్ట్ లు గా ఈ షో లో సందడి చేశారు. వీరిద్దరికి ఫన్నీ టాస్క్ లు ఇవ్వటమే కాకుండా తన ప్రశ్నలతో ఇద్దరికీ చెమటలు పట్టించాడు.

ఇక ఈ ఎపిసోడ్ లో హీరోయిన్ మీనా తో ముద్దు విషయం గురించి సీక్రెట్ బయట పెట్టాడు. ఈ క్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ బొబ్బిలి సింహం సినిమా షూటింగ్ సమయంలో మీనా తో జరిగిన కిస్ సీన్ బయట పెట్టాడు. వేమూరు గుట్టపైన బొబ్బిలి సింహం ఓపినింగ్ ఉన్నప్పుడు పక్కనే రజినీకాంత్ గారు, మీనా గారు షూటింగ్ చేస్తున్నారు. మీనా ఈ సినిమాలో ఉండటం వల్ల ఓపెనింగ్ కి వచ్చారు . నా డైలాగ్ అయిపోయిన తరవాత ఔట్ ఫీల్డ్ నుంచి ఆవిడను రమ్మని నా బుగ్గ మీద ముద్దుపెట్టమన్నారు. నా డైలాగ్ అయిపోయినా ఆవిడ రావడం లేటైందని.. ఇంకా రాలేదని అటు తిరిగా. అప్పుడు ఇద్దరి పెదాలు దగ్గరకి రావడతో ఆమె కెవ్వుమని అరిచింది అంటూ మీనా తో ముద్దు సీన్ గురించి చెప్పుకొచ్చాడు.