‘అమ్మ మీద ఒట్టేసి మరీ అబద్ధం చెప్పాను..’ అంటూ వాపోయాడు యాంకర్ రవి నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్‌లో. లహరి మీద ప్రియ వద్ద రవి చేసిన జుగుప్సాకర్ వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల ప్రభావంతో ప్రియ, నామినేషన్ సందర్భంగా మరింత జుగుప్సాకరంగా వ్యవహరించడం, ఈ వ్యవహారంలో రవిదే తప్పని తేల్చిన హోస్ట్ నాగార్జున.. ఇదంతా తెలిసిన సంగతే. తాజా నామినేషన్ ఎపిసోడ్ సందర్భంగా, పాత గాయాన్ని కెలుక్కున్నాడు రవి. ‘అమ్మ మీద ఒట్టేసి కూడా అబద్ధం చెప్పాను..’ అని అక్కడికేదో తాను నిజాయితీగా తప్పు ఒప్పుకున్నట్లు చెబుతున్నా, అంతలోనే, ‘నా కెరీర్ మీద ఒట్టేసి చెబుతున్నా..’ అంటూ మరో కంటెస్ట్ మీద అందరి సమక్షంలోనే వ్యాఖ్యలు చేశాడు.
‘ఒట్టేసి చెప్పడం’ అనేదానికి విలువ లేకుండా చేసుకున్న రవి, ఇంకసారి ఒట్టేసి చెప్పడమేంటి.? ఇదిలా వుంటే, ఆర్జే కాజల్‌ని నామినేట్ చేసే క్రమంలో రవి నవ్వులపాలైపోయాడు. కాజల్, రవిని కొట్టిందట సరదాగా ఓ సందర్భంలో. కానీ, రవికి అది నొప్పిగా అనిపించిందట. అందుకే నామినేట్ చేస్తున్నానని సిల్లీ రీజన్ చెప్పాడు రవి. దానికి కాజల్ గట్టి సమాధానమే ఇచ్చింది. నా జుట్టు లాగావ్ ఓ సారి. నాకు బాధ కలిగింది, నీకు గట్టిగా చెప్పాను కూడా. నీకు అలాగే నొప్పి అనిపించి వుంటే అప్పుడే చెప్పెయ్యాలి. కానీ, ఇప్పుడిలా నామినేట్ చేయడానికి దాన్ని సిల్లీ రీజన్‌గా వాడటం బాగా లేదు.. అంటూ కాజల్ చెప్పుకొచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో కాజల్ విన్నర్ అయితే, రవి బదనాం అయిపోయాడు.