Kannappa: మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కిన చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ నటించిన విషయం తెలిసిందే. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అవ్వడానికి కారణం ప్రభాస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు అని అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను బాగా ఆదరిస్తారని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు ఏంటి అన్న విషయాలు ఇప్పటికే పోస్టర్స్ టీజర్ రూపంలో తెలిపిన విషయం తెలిసిందే. కానీ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడు? ఎంతసేపు కనిపిస్తాడు? ఆ సన్నివేశం ఏంటి? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు రచయిత బీవీఎస్ రవి.. ప్రభాస్ క్యారెక్టర్ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చాడు. కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవి మాట్లాడుతూ.. మంచు విష్ణు, ప్రభాస్ ల పాత్రల గురించి వీరి మధ్య వచ్చే సన్నివేశాల గురించి అలాగే సినిమా గురించి గొప్ప ఎలివేషన్ ఇచ్చాడు.
ప్రభాస్ పాత్ర సెకండ్ హాఫ్ లో ఉంటుందని అతను వెల్లడించాడు. ఇంటర్వెల్ తర్వాత సరిగ్గా 15వ నిమిషంలో ప్రభాస్ పాత్ర సినిమాలోకి ప్రవేశిస్తుందని అక్కడి నుంచి సినిమా వేరే లెవెల్లో ఉంటుందని అతను చెప్పాడు. 27 నిమిషాల పాటు ప్రభాస్, విష్ణు మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని, మొత్తంగా ద్వితీయార్ధం అదిరిపోతుందని తెలిపారు రవి. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా రచయిత రవి చేసిన వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు ఒకవైపు నెగెటివిటీ కామెంట్స్ వినిపిస్తున్న కూడా మేకర్స్ అవేమీ పట్టించుకోకుండా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు.