ఇన్సైడ్ టాక్ : చరణ్ 16వ సినిమా ఆగిపోయిందా? చరణ్ పై ఎందుకీ అక్కసు!

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ దగ్గర మెగా ఫామిలీ నుంచి ప్రౌడ్ హీరోగా నిలిచింది డెఫినెట్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అనే చెప్పాలి. అటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నా కానీ మెగా కుటుంబ హీరోల విషయానికి వస్తే మాత్రం డెఫినెట్ గా చాలా సార్లు రామ్ చరణ్ మాత్రమే మెగా లెగసి ని వేరే లెవెల్ లో తన సినిమాలతో సెట్ చేసి పెట్టాడు.

అందుకే మెగా ఫ్యాన్స్ లో రామ్ చరణ్ అంటే ఒక గౌరవం ఉంటుంది. అయితే లేటెస్ట్ గా కూడా RRR దెబ్బతో పాన్ వరల్డ్ లెవెల్లో ఒక హాట్ టాపిక్ గా నిలిచిన చరణ్ పై మాత్రం ఒక సెక్షన్ మీడియా వర్గాలు మాత్రం తమ అక్కసు చూపిస్తున్నారు.

తన ఎదుగుదల చూసో ఏమో కానీ తన నెక్స్ట్ సినిమాలు ఆగిపోయాయి అంటూ ప్రస్తుత సినిమాలు బాగా రావట్లేదు అంటూ పలు కామెంట్స్ నెగిటివ్ న్యూస్ లు బాగానే స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా రామ్ చరణ్ నెక్స్ట్ భారీ సినిమా 16వ చిత్రం యంగ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా ఆగిపోయింది అని కొన్ని గాసిప్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కానీ మాకున్న ఖచ్చిత సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా పై ఆ వార్తలన్నీ పచ్చి అబద్దాలు అట. రామ్ చరణ్ 16వ సినిమా ఆగలేదని కన్ఫర్మ్ గా తెలుస్తుంది.

దీనితో అయితే ఆ సెక్షన్ మీడియా స్పెర్డ్ చేసిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని అందరు తెలుసుకోవాలి. మాకున్న సమాచారం ప్రకారం అయితే ఇది ఒక హాలీవుడ్ లెవెల్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నారు.