సంచలన నటి శ్రీరెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. శ్రీరెడ్డి కుటుంబానికి దూరంగా ఉంటున్న విషయం స్వయంగా ఆమే వెల్లడించింది. ఆమెకు కుటుంబీకుల నుండి ఎటువంటి సత్సంబంధాలు లేవని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. ఆమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుండి తన ఫ్యామిలీ తనని దూరం పెట్టారు. వారి నుండి ఆమెకు ఎలాంటి సపోర్ట్ లేదని ఆమె చాలాసార్లు చెప్పింది. అయితే కుటుంబం అంతా దూరంగా ఉంచినా ఆమె అమ్మమ్మ మాత్రం తనకి మద్దతుగా ఉండేదట. కాగా ఆమెని అందరూ దూరం పెట్టినా దగ్గరకు తీసుకున్న అమ్మమ్మ మృతి చెందడంతో శ్రీరెడ్డి తీవ్ర దుఃఖానికి లోనయ్యింది.
ఆమె తన అమ్మమ్మ మరణ వార్తను ఈరోజు ఫేస్బుక్ లో పోస్ట్ చేసి ఆవేదనకు గురయ్యింది. శ్రీరెడ్డి తన అమ్మమ్మతో తనకు ఉన్న అనురాగాన్ని ఈ పోస్ట్ ద్వారా వ్యక్తం చేసింది. అమ్మమ్మ లేని లోటు ఎవరూ పూడ్చలేరంటూ దుఃఖిస్తోంది. శ్రీరెడ్డి ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ వివరాలు కింద ఉన్నాయి చదవండి.
“అమ్మమ్మ నీకోసం నేను ఎన్ని కన్నీళ్లు రాల్చాలి, నీ స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చెయ్యగలరు?? అమ్మ నావైపు లేనప్పుడు నాకు సహాయం చేసింది, మద్దతుగా నిలిచింది నువ్వే.. నాకు ఎవరున్నారు? నీ ఆకస్మిక మరణవార్త నేను భరించలేను. నా జీవితంలో మెయిన్ పిల్లర్ ని కోల్పోయాను. నేను అమ్మమ్మ అని ఇంకెవరిని పిలవాలి? ప్రేమగా బంగారు గాజులు చేయించామని అడిగావు నన్ను. అవి కానుకగా ఇవ్వాలని, సంక్రాంతికి నిన్ను కలవాలని అనుకున్నాను. ఈరోజు నన్ను నేనే కోల్పోయాను.” అంటూ శ్రీరెడ్డి ఆవేదనతో పోస్టు పెట్టింది.
అందుకేనా ఆ వీడియోను తీసేసింది?
అమ్మమ్మ మరణ వార్త తెలిసే సమయానికి 15 నిమిషాల ముందే శ్రీరెడ్డి ఫేస్ బుక్ లోని తన పేజీలో చీర సింగారం చూపుతూ సెల్ఫీ వీడియో తీసుకుని పోస్టు చేసింది. అయితే అమ్మమ్మ మరణవార్త వినడంతో ఆమె చలించిపోయింది. వెంటనే తన వాల్ మీద పోస్టు చేసిన చీరకట్టులో డ్యాన్స్ చేసిన వీడియోను శ్రీరెడ్డి తొలగించింది. బాధలో ఉన్నందుకే ఆ వీడియోను తన వాల్ మీదనుంచి తొలగించినట్లు తెలుస్తోంది.