Sri Reddy: మాకు గుర్తింపు లేకపోయినా పార్టీని నెత్తిన పెట్టుకున్నాం…. మీకేం తక్కువైంది: శ్రీ రెడ్డి

Sri Reddy: ప్రముఖ సంచలన తార శ్రీరెడ్డి గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు అయితే తాజాగా ఈమె వైకాపా పార్టీ నుంచి రాజీనామాలు చేసే వెళ్లిపోతున్న నేతలను ఉద్దేశిస్తూ చేసినటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా వైకాపా పార్టీ నుంచి పెద్ద ఎత్తున కీలక నేతలు వలసలు వెళుతున్న సంగతి తెలిసిందే కొంతమంది పార్టీకి దూరంగా ఉండగా మరికొందరు ఇతర పార్టీలలోకి వెళ్తున్నారు.

ఈ క్రమంలోనే వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే అయితే ఈ విషయంపై స్పందిస్తూ ఈమె ఒక వీడియోని విడుదల చేశారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. దయచేసి ఎవరూ కూడా పార్టీని కష్టకాలంలో వదిలి వెళ్ళకండి. వైయస్ జగన్ అన్నకు సపోర్ట్ చేయండి అంటూ ఈమె అందరిని వేడుకున్నారు.

వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి పార్టీకి రాజీనామా బాధించిందని అన్నారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారు..సమస్య ఏమిటని అడిగే అర్హత, హక్కు, పార్టీలో స్థానం తనకు లేదు అని చెప్పుకొచ్చారు. పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులలో మన పార్టీ ఉంది. ఇలాంటి సమయంలో కాస్త ఓపిక పట్టుకొని ఎదురుచూడండి. మాలాంటి వారికి పార్టీలో ఏ విధమైనటువంటి గుర్తింపు లేకపోయినా పార్టీని నెత్తిన పెట్టుకొని మోస్తున్నాము.

మాకు గుర్తింపు ఇవ్వకపోయినా జగనన్నకు మద్ధతుగా తమవంతు ఉడుతా సహాయం చేస్తున్నామని నటి శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాజీనామాలు పార్టీ పటిష్టత ప్రయత్నాలను, కేడర్‌ను నిరుత్సాహ పరుస్తాయని పేర్కొన్నారు. పార్టీ అన్నా..జగన్ అన్నా అభిమానం మాత్రం అందరిలోనూ ఉందని తెలిపారు. ప్రస్తుతం మన పార్టీ అధికారంలో లేదు ఇలాంటి సమయంలో మీరు పార్టీ పరంగా యాక్టివ్ గా లేకపోయినా పరవాలేదు సైలెంట్ గా ఉంటూ పార్టీకి రాజీనామా చేయకపోతే చాలు దయచేసి ఎవరూ కూడా పార్టీ నుంచి వెళ్ళకండి అంటూ శ్రీ రెడ్డి షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.