AP: ఏపీలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందంటూ వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలను పక్కనపెట్టి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది వైసీపీ నేతలను అరెస్టు చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే . తాజాగా సినీ నటుడు పోసానిని కూడా అరెస్టు చేయడం సంచలనాలకు కారణమవుతోంది.
ఈ క్రమంలోనే తదుపరి అరెస్ట్ అయ్యేది ఎవరు అంటూ పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది సెలబ్రిటీలు వైఎస్ఆర్సిపి పార్టీకి పనిచేశారు. ఈ క్రమంలోనే గత ఐదు సంవత్సరాల కాలంలో పోసాని వర్మ శ్రీరెడ్డి వంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున కూటమినేతల గురించి విమర్శల వర్షం కురిపించారు.
ఇక తాజాగా కూటమి అధికారంలోకి రావడంతో వీరిపై ఏపీలో పలుచోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఇలా వరుసగా అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో వీరందరూ భయపడుతూ పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా తాము తప్పు చేశామని మా తప్పును మన్నించి మమ్మల్ని వదిలేయాలి అంటూ కూడా కూటమినేతలను వేడుకున్నారు.
ఇలా సారీలు చెప్పిన రాజకీయాలకు దూరమవుతున్న కూడా కూటమి నేతలు వైసిపి వారిని వదిలిపెట్టడం లేదని తెలుస్తోంది. ఇన్ని రోజులు మౌనంగా ఉండడంతో అరెస్టుల విషయంలో కూటమి వెనకడుగు వేసిందని అందరూ భావించారు అయితే ఉన్నఫలంగా పోసానిని అరెస్టు చేయడంతో పలువురు నేతలలో అలాగే సెలబ్రిటీలలో కూడా తెలియని భయం మొదలైందని తెలుస్తుంది. ఇలా పోసాని అరెస్ట్ అనంతరం తదుపరి ఎవరిని అదుపులోకి తీసుకోబోతున్నారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. మరి రెడ్ బుక్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఎవరిని అరెస్టు చేయబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.