లీక్ షాక్ : “RC 15” నుంచి ఊహించని ఎలిమెంట్ బయటకి..!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ స్టార్ అండ్ గ్లామరస్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా పాన్ ఇండియా టాప్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం “RC 15” గా పరిగణిస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో అంచనాలు నెలకొల్పుకోగా శంకర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

దీనితో చాలా నమ్మకం పెట్టుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు దాదాపు 70 శాతం వరకు కంప్లీట్ అయ్యింది. అయితే ఈ సినిమాపై ఎప్పుడు లేనిది ఓ షాకింగ్ ఎలిమెంట్ లీక్ అయ్యినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఈ చిత్రంలో ఓ క్రేజీ సాంగ్ అయితే ఇప్పుడు దాదాపు ఒక నిమిషం ఉన్న బిట్ బయటకి వచ్చినట్టుగా సోషల్ మీడియాలో ఓ ట్యూన్ వైరల్ అవుతుంది. దీనితో ఇది విన్న అభిమానులు ఓ రేంజ్ లో ఈ సాంగ్ కోసం చెప్పుకుంటున్నారు.

తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే శంకర్ ఇలాంటి లీక్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి మరి. ఇక అలాగే ఈ సినిమాకి సంగీతం ఇచ్చిన థమన్ పై కూడా మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. మొత్తానికి ఈ సాంగ్ అయితే ఈ సినిమా లోనిదేనా కాదా అనేది చూడాలి.