గాసిప్స్ : శంకర్ – చరణ్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ని ఆ దేశంలో ప్లాన్ చేస్తున్నారా.?

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకొని ఉన్న పలు పాన్ సినిమా సినిమాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు మావెరిక్ దర్శకుడు శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కూడా ఒకటి. సినిమా ప్రకటించిన నాటి నుంచే అనేక అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం దాదాపు 70 శాతం వరకు షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది.

మరి ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాల షూటింగ్స్ నిలిచిపోవడం వల్ల శంకర్ తన మరో సినిమా “భారతీయుడు 2” కి షిఫ్ట్ అయ్యారు. అయితే మరి లేటెస్ట్ గా చరణ్ తో సినిమాపై ఫస్ట్ లుక్ కోసం మాత్రం అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

ఈ లుక్ ని ఈ ఆగస్ట్ లోనే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్లాన్ చేస్తున్నారని ఇది వరకే టాక్ ఉండగా ఇప్పుడు దీనిపై మరో క్రేజీ గాసిప్స్ వినిపిస్తున్నాయి. వీటి ప్రకారం అయితే శంకర్ ఏకంగా దుబాయ్ లో ఈ సినిమా గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేసారని అంటున్నారు.

అలాగే ఈ ఈవెంట్ గాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు శాండిల్ వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ లు కూడా హాజరు కానున్నారని అంటున్నారు. మరి వీటిలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అయితే కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.