సాహో ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్ !

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం సాహో. సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హాలీవుడ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ త‌ర‌హాలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైల‌ర్‌, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది.

అయితే ఆడియో రిలీజ్ ని భారీ స్థాయిలో చేయబోతున్నారు. ఆగస్ట్ 17 యల్.బి స్టేడియం లో మరియు 21 న కొచ్చి లో 25 న బెంగళూరు లో 27న ముంబై లో జరుగనుంది అని సమాచారం.

ఇదివ‌ర‌కెన్న‌డూ చూడ‌ని యాక్ష‌న్‌ను చూడ‌బోతున్నార‌ని, భార‌త అతి పెద్ద యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా సాహో తెర‌కెక్కుతోంద‌ని యూవీ క్రియేషన్స్ సంస్థ తెలిపింది. ఆగ‌స్టు 30న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది.