`సాహో` యూఎస్ ప్రీమియ‌ర్లు క్యాన్సిల్ లేద‌ట‌

క్యాన్సిల్ మాట అస‌త్యం.. అభిమానుల‌కు గుడ్ న్యూస్!

మోస్ట్ అవైటెడ్ `సాహో` అమెరికా ప్రీమియ‌ర్లు క్యాన్సిల్ చేశార‌ని ఇదివ‌ర‌కూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగింది. చెప్పుకోలేని ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో నిర్మాత‌లు క్యాన్సిల్ చేశార‌ని.. దానికి కాంప‌న్సేష‌న్ ప్లాన్ చేశార‌ని ప్ర‌చార‌మైంది. అమెరికా ప్రీమియ‌ర్లు లేక‌పోతే 10 కోట్ల వ‌ర‌కూ న‌ష్టం త‌ప్ప‌ద‌ని పంపిణీదారులు అంచ‌నా వేసిన‌ట్టు చెప్పుకున్నారు.

<

p style=”text-align: justify”>అయితే ఇదేదీ నిజం కాద‌ని యు.వి.సంస్థ స‌న్నిహితులు చెబుతున్నారు. యూఎస్ ప్రీమియ‌ర్లు క్యాన్సిల్ చేయ‌లేదు. య‌థాత‌థంగా 29 ఆగ‌స్టు సాయంత్రం నుంచే ప్రీమియ‌ర్లు జ‌రుగుతాయి. ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగులు ప్రారంభించార‌ని తెలుస్తోంది. ఆగ‌స్టు 30 రిలీజ్ సంద‌ర్భంగా ఒక‌రోజు ముందే యూఎస్ ప్రీమియ‌ర్ల‌కు ప్లాన్ చేశార‌ట‌. మొద‌టి రోజు మొద‌టి ఆట టిక్కెట్ల కోసం ఫ్యాన్స్ ఎగ‌బ‌డుతున్నార‌ని చెబుతున్నారు. మ‌రోవైపు యూఎస్ ప్రీమియ‌ర్ల ద్వారా దాదాపు 13 కోట్లు (1.5 మిలియ‌న్ నుంచి 2 మిలియ‌న్ డాల‌ర్లు) వ‌రకూ వ‌సూల‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నార‌ట‌. ఒక‌వేళ సినిమా డైరెక్టుగానే రిలీజైతే ఓపెనింగ్ డే 13 కోట్ల వ‌సూళ్లు ద‌క్కేవ‌ని అంచ‌నా వేస్తోంది ట్రేడ్.