రూ.21 కోట్లు అప్పు చేసిన ప్రభాస్…కారణం ఏమిటో తెలిస్తే షాక్..?

Prabhas-embarrassment-moment-again-in-limelight

దివంగత హీరో కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమా మంచి హిట్ అవటంతో టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకొని హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో నటించడం వల్ల పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటినుండి కేవలం పాన్ ఇండియా సినిమాలలో మాత్రమే నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ప్రభాస్ తో సినిమా అంటే కొన్ని వందల కోట్ల బడ్జెట్ తో సినిమా తీయవలసి ఉంటుంది.

అంతేకాకుండా బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ 100 నుండి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకు అంటున్నాడు. ఇలా సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోగా ప్రభాస్ గుర్తింపు పొందాడు. ఇలా ఒక్కొక్క సినిమాకి కొన్ని వందల కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్న ప్రభాస్.. రూ.21 కోట్ల రూపాయలు అప్పు చేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కొన్ని వందల కోట్లకు వారసుడైన ప్రభాస్ ఇలా రూ.21 కోట్లు అప్పు చేయవలసిన అవసరం ఏమిటని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా పరాజయం ఎదుర్కొన్నాయి. ఈ సినిమాలు ప్లాప్ అవటంతో నిర్మాతలు కూడా భారీగా నష్టపోయారు. అందువల్ల నిర్మాతలను ఆ నష్టాలనుండి కొంతవరకు బయటపడేయటానికి ప్రభాస్ కొంతవరకు తన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమాలకు వచ్చిన నష్టాలను నిర్మాతలతో పాటు ప్రభాస్ కూడా హరిస్తూ తన ప్రాపర్టీని బ్యాంకులో ఉంచి రూ. 21 అప్పు తీసుకొని మరి నిర్మాతలకు ఇచ్చినట్లు తెలుస్తోంది.