ఆ దేశంలో ‘సాహో’ బ్లాక్‌బస్టర్ .. 250 డేస్ కంప్లీట్ !

ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఏ హాలీవుడ్ హీరోకి లేని క్రేజ్ ప్రభాస్ సొంతం. ఇకపోతే , ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా.. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘సాహో’.. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో.. భారీ అంచనాల మధ్య 2019 ఆగస్టు 30న విడుదలైంది.

ఈ సినిమా ఫ్యాన్స్‌ కి సూపర్ అనిపిస్తే, ప్రేక్షకులు మాత్రం యావరేజ్ అనేశారు. కట్ చేస్తే ఇప్పుడు ‘సాహో’ విజయవంతంగా 250 రోజులు పూర్తి చేసుకుంది. అది కూడా జపాన్‌లో కావడం విశేషం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి విదేశాల్లోనూ అభిమానులున్నారు.

జాపాన్‌లో అయితే డార్లింగ్‌కి భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జపాన్ లాంగ్వేజ్ సబ్ టైటిల్స్‌తో ఇండియాలో కంటే కాస్త ఆలస్యంగా విడుదలైన ‘సాహో’ అక్కడి ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. ఇటీవలే 250 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. త్వరలో 300 రోజులు ఆపై 365 డేస్ ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.