రాధే శ్యామ్ ట్రైలర్ రాబోతోంది.. డార్లింగ్ ఫ్యాన్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సిద్దంగా ఉండండి ..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సాహో లాంటి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా తర్వాత నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ అయిన గోపీకృష్ణ మూవీస్‌తో పాటు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Radhe Shyam: Makers Introduce Prabhas As Vikramaditya Ahead Of His Birthday  And The Superstar Looks Dapper! - Onhike

కాగా ఇప్పటికే ఈ సినిమా మేయిన్ థీం ఏంటన్నది బీట్స్ ఆఫ్ ‘రాధే శ్యామ్’ లో చూపించాడు దర్శకుడు. ఇక ఫస్ట్ పోస్టర్ నుంచి బీట్స్ ఆఫ్ ‘రాధే శ్యామ్’ అలాగే ఈ సినిమాలో ప్రభాస్ ‘విక్రమాదిత్య’ గా పూజా హెగ్డే ‘ ప్రేరణ ‘ గా నటిస్తున్న పోస్టర్ సినిమా మీద భారీగా అంచనాలు పెంచాయి. ముందు నుంచి ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మంచి రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతుందని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కంప్లీట్ క్లాస్ అండ రొమాంటిక్ సినిమాగా తెరకెక్కుతుందని ఇందులో భారీ స్థాయిలో యాక్షన్ సీన్స్ ఉండవని కూడా ముందుగానే ఫ్యాన్స్ కి క్లారిటీ ఇస్తున్నారు.

Prabhas unveils Pooja Hegde's 'Radhe Shyam' look -

కాగా ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ జరుగుతున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ తో ‘రాధే శ్యామ్’ షూటింగ్ మొత్తం కంప్లీటవనుండగా లేటేస్ట్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. ఇప్పటి వరకు ‘రాధే శ్యామ్’ నుంచి వచ్చిన సర్‌ప్రైజెస్ కంటే భారీ సర్‌ప్రైజ్ ని ఇవ్వడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్టు సమాచారం. అదే ‘రాధే శ్యామ్’ ట్రైలర్. ఈ ట్రైలర్ ని నూతన సంవత్సరం కానుకగా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అంటే న్యూ ఇయర్ అయిన జనవరి 1 ఫస్ట్ రోజున ‘రాధే శ్యామ్’ ట్రైలర్ రాబోతోందని అర్థమవుతోంది.