డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. డార్లింగ్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజమౌళి “బాహుబలి” మూవీతో దేశమంతా తన స్టార్డమ్ ని దక్కించుకున్నాడు , చరిత్రలో తనకంటూ ఓ చెరగని ముద్ర వేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇక “బాహుబలి” తరువాత ఎన్నో అంచనాలతో గతేడాది విడుదలైన ప్రభాస్… ‘సాహో’ చిత్రం ఫలితం అందరికీ తెలిసిందే. హిందీలో హిట్ అయినప్పటికీ…తెలుగులో మాత్రం ప్లాప్ మూవీగా మిగిలిపోయింది.ఇప్పుడు ఈ మూవీ డార్లింగ్ ఖాతాలో ఒక చెత్త రికార్డు ని నమోదు చేసింది .
విషయంలోకి వెళ్తే… ఈ ‘సాహో’ మూవీ తెలుగు వెర్షన్ శాటిలైట్ బిజినెస్ చాలా ఆలస్యంగా జరిగింది. తెలుగు శాటిలైట్ రైట్స్ కు ఎక్కువ రేటు దక్కుతుందేమో అని నిర్మాతలు ఆశపడి ఎవ్వరికీ అమ్మలేదు. అయితే రిలీజ్ తరువాత ఫలితం తారుమారు అవటంతో ‘సాహో’ కి ఎక్కువ రేటు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి ‘జీ తెలుగు’ ఛానల్ వారు రూ.14.5 కోట్లకు శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేశారు. థియేటర్స్ లో హిట్ కాకపోయినప్పటికీ భారీ కలెక్షన్లను రాబట్టిన సినిమా కాబట్టి.. ‘సాహో’ బుల్లితెర పై కూడా రికార్డు టి.ఆర్.పి ని నమోదు చెయ్యడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది.మొదటిసారి ‘సాహో’ ప్రీమియర్ టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 5.81 టి.ఆర్.పి రేటింగ్ మాత్రమే నమోదయ్యింది. అటు తరువాత రెండు వారాలకు ఈ చిత్రాన్ని మళ్ళీ టెలికాస్ట్ చెయ్యగా.. అప్పుడు కూడా కేవలం 4.11 టి.ఆర్.పి రేటింగ్ ను సాధించి నిరాశపరిచింది.
‘జీ తెలుగు’ ఛానల్ వాళ్ళు ఈ మూవీని ఎందుకు కొన్నామా అని తెగ ఫీలయిపోతున్నారట. ‘కె.జి.ఎఫ్’, ‘ఐ’ వంటి చిత్రాలు చాలా ఆలస్యంగా బుల్లితెరలో టెలికాస్ట్ అయినప్పటికీ మంచి టి.ఆర్.పి రేటింగ్ లనే నమోదు చేసాయి. అయితే ‘సాహో’ విషయంలో అలా జరగ లేదు. ఇలా అయితే… ‘సాహో’ చిత్రం శాటిలైట్ రైట్స్ ను కొనుగోలు చేసిన ‘జీ తెలుగు’ వారు సేఫ్ అవ్వడం కష్టమనే చెప్పాలి. డార్లింగ్ ‘డై-హార్డ్ ‘ ఫాన్స్ కి ఈ విషయం ఏమాత్రం మింగుడు పడటం లేదట .