బిగ్ న్యూస్ : RRR సెన్సేషన్..ఆస్కార్ లో ఈ క్యాటగిరీస్ కి ఛాన్స్ ఉందట.!

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర నెంబర్ 1 దర్శకుడుగా నిలిచిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది మన తెలుగు సినిమా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అలాగే తాను చేసిన బాహుబలి తో ఇండియన్ సినిమా దగ్గర టాప్ దర్శకుల్లో ఒకరిగా తాను మారగా..

ఈసారి చేసిన ట్రిపుల్ ఆర్(RRR) సినిమాతో అయితే ఇక తిరుగు లేకుండా నెంబర్ 1 డైరెక్టర్ గా తాను మారిపోయారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో చేసిన ఈ సెన్సేషనల్ మల్టీ స్టారర్ గ్లోబల్ వైడ్ భారీ వసూళ్లు తో రికార్డులు సెట్ చేసింది.

మరి ఈ సినిమాకి ఇంటర్నేషనల్ వైడ్ చాలా ఆదరణ అందుకున్న ఈ చిత్రాన్ని ఆస్కార్స్ కూడా వారించాలి అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఆల్రెడీ ఓ అంతర్జాతీయ సంస్థ ఎన్టీఆర్ కి ఆస్కార్ వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇంకా ఇప్పుడు అయితే మళ్ళీ మరిన్ని నామినేషన్స్ ఈ సినిమాకి దక్కొచ్చని వారు చెబుతున్నారు.

ఇక ఆ కేటగిరీ లు ఏంటో చూసినట్టు అయితే బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాల జాబితాలో బెస్ట్ సినిమాగా RRR అలాగే బెస్ట్ దర్శకుడు గా రాజమౌళి అలాగే బెస్ట్ నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు ఇంకా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా దోస్తీ సాంగ్ అలాగే బెస్ట్ స్క్రీన్ ప్లే నామినేషన్స్ లో ఈ చిత్రం నిల్చినట్టు చెబుతున్నారు. దీనిపై సినిమా యూనిట్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.