#RRR సినిమా పై  ఓ ఇంట్రస్టింగ్ న్యూస్

బాహుబలి తర్వాత రాజమౌళి ఏ హీరోతో సినిమా చేస్తాడనే అంచనాలకు తెరదించుతూ రాజమౌళి..రామ్ చరణ్, తారక్ లో సినిమా ప్రకటించారు. అయితే ఆ ప్రకటన తర్వాత మరే ప్రకటన చేయలేదు.

కానీ ఆ సినిమా గురించి దాదాపు రోజుకో వార్త అన్నట్లుగా మీడియాలో ఏదో ఒకటి నలుగుతూనే ఉంది. పైకి ప్రకటన చేయకపోయినా ఈ సినిమా కు సంభందించి బ్యాక్ గ్రౌండ్ లో వర్క్ జోరుగా నడుస్తోంది.  తాజాగా ఈ చిత్రం గురించిన ఓ చిత్రమైన విషయం బయిటకు వచ్చింది.

అదేమిటంటే..ఈ సినిమా నిమిత్తం   హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ రెమ్యూనిరేషన్ తీసుకోవడం లేదు. అలాగే దర్శకుడు రాజమౌళి కూడా రెమ్యునేషన్ వద్దనుకున్నారు. అలాగని ఏదో ఛారిటి కోసం సినిమా చేస్తున్నారు అనుకునేరు..అలాంటిదేమీ లేదు. ఈ ముగ్గురూ కూడా సినిమా లాభాల్లో వాటానే తీసుకోబోతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

ఎందుకంటే రెమ్యునేషన్ తీసుకోదలిస్తే ఎంత అనేది తేలాలంటే చాలా కష్టం. రామ్ చరణ్,ఎన్టీఆర్ ఇద్దరు కూడా దాదాపు రెండు వందల రోజులు ఈ సినిమా కోసం కేటాయించాలి. అంటే రెండు సినిమాల కష్టం. అలా లెక్కేస్తే చాలా ఇవ్వాలి. సినిమా ప్రారంభానికి ముందే వీళ్లు ముగ్గురూ రెమ్యునేషన్ తీసుకుంటే నిర్మాతకు ప్రాజెక్టుపై పెట్టుబడి పెట్టడానికి కష్టం అవుతుంది.

అందుకే…మొదట సినిమా చేసి..ఆ తర్వాత వచ్చిన బిజినెస్ నుంచి తమ వంతు ఎంత అనేది  లెక్కవేసుకుని షేర్ తీసుకుంటారని సమాచారం. కాస్తంత గ్రాండ్ గానే లాభాలు వస్తాయి కాబట్టి…హీరోలిద్దరూ ఎగిరి గంతేసి ఒప్పుకుని ఉంటారు..ఏమంటారు.

ఇక ఈ హీరోలిద్దరితో కలిపి రాజమౌళి ఓ వర్క్ షాప్ నిర్వహించబోతున్నట్టు  తెలిసింది.  దాదాపు పదిహేను రోజులు పాటు ఈ వర్క్ షాప్ నడుస్తుందిట.   కథలోసారాన్ని ఈ వర్క్ షాప్ లో …హీరోల మైండ్ లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తారు. దాంతో హీరోలు అదే మూడ్ ని కంటిన్యూ చేయగలిగి మరింత డెప్త్ గా సినిమా చేయగలుగుతారు.