రజినీకాంత్ “జైలర్” లో తన పవర్ఫుల్ లేడీ విలన్ ని కన్ఫర్మ్ చేసిన మేకర్స్.!

తమిళ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు రెండు మూడు సినిమాలు ఓకే చేసిన సంగతి అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాల్లో తమిళ దర్శకుడు “బీస్ట్”, “వరుణ్ డాక్టర్” ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో స్టార్ట్ చేసిన లేటెస్ట్ సినిమానే “జైలర్”.

ఒక భారీ ఏక్షన్ తో కూడిన ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా అభిమానుల్లో చాలా అంచనాలు రేకెత్తిస్తుంది. లేటెస్ట్ గా అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాగా దీనికి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక తాజాగా అయితే చిత్ర మేకర్స్ ఈ సినిమాపై ఇంకో బిగ్ అప్డేట్ ని కూడా అందించారు.

ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం పేర్లు రివీల్ చేస్తూ ఇది వరకు వచ్చిన గాసిప్ స్టార్ నటి రమ్య కృష్ణ పేరుని కూడా ఈ సినిమాలో ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ పవర్ ఫుల్ కాంబోలో ఉండే మ్యాజిక్ ఎలాంటిదో తమిళ్ సహా తెలుగు ప్రేక్షకులకి కూడా తెలుసు.

వీరి మధ్య సీన్లు ఏ లెవెల్లో ఉంటాయో “నరసింహ” చూసినవాళ్లు అంత తేలిగ్గా మర్చిపోరు. అందుకే ఈ సినిమాలో రమ్య కృష్ణ పేరు అనగానే ఆ మధ్యనే భారీ హైప్ రాగా ఇప్పుడు చిత్ర యూనిట్ కూడా దీనిపై అధికారిక అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ లో మరింత ఉత్సుకత తీసుకొచ్చింది. దీనితో ఈ సెన్సేషనల్ కాంబోని ఎప్పుడు చూస్తామా అని అంతా ఎదురు చూస్తున్నారు.