‎Rajinikanth: రజనీకాంత్ తో నటించనంటూ 3 సార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్.. కానీ చివరికి!

Rajinikanth: టాలీవుడ్ హీరో, సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి పరిచయం అక్కర్లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. కాగా రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ఆయన ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. తెలుగుతో పాటు తమిళంలో కూడా అనేక సినిమాలలో నటించి రెండు భాషల్లోనూ కోట్లాదిమంది అభిమానుల మనసులను గెలుచుకున్నారు. సాధారణ బస్ కండక్టర్ నటనపై ఆసక్తితో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

‎ ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. కాగా కెరిర్ మొదట్లో ఎక్కువగా నెగిటివ్ పాత్రలో నటించిన రజనీకాంత్ కవికుయిల్ సినిమాతో హీరోగా నటించడం ప్రారంభించారు. కాగా ఇప్పటివరకు 100పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనదైన శైలిలో ముద్రవేసుకున్నారు. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ సహా అనేక భాషల చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. కాగా రజినీకాంత్ చివరగా కూలీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జైలర్ 2 సినిమాలో నటిస్తున్నారు రజినీకాంత్.

‎ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. అయితే మాములుగా రజినీ సినిమాలో ఛాన్స్ కోసం అందరూ హీరోయిన్స్ ఎదురు చూస్తుంటారు. కానీ ఒక్క హీరోయిన్ మాత్రం రజినీతో నటించేందుకు ఒప్పుకోలేదట. ఒకటి, రెండు సార్లు కాదు.. ఏకంగా మూడుసార్లు రజినీ సినిమాను రిజెక్ట్ చేసింది. ఆమె మరెవరో కాదు ఐశ్వర్య రాయ్. మొదట్లో ఆమెను పడయ్యప్ప (నరసింహా) చిత్రంలో నీలాంబరి పాత్రకు తీసుకోవాలనుకున్నారట. కానీ ఆమె మరో సినిమాతో బిజీగా ఉంది. ఆ తర్వాత బాబా చిత్రంలో హీరోయిన్ గా నటించాలని కోరగా రిజెక్ట్ చేసిందట. దీంతో ఆ ఆఫర్ మనీషా కొయిరాల వద్దకు చేరింది. ఆ తర్వాత శివాజీ చిత్రం, చంద్రముఖి సినిమాల కోసం అడగగా అవి కూడా సఫలం కాలేదట. చివరగా డైరెక్టర్ శంకర్ కోరడంతో రోబో చిత్రంలో రజినీతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఐశ్వర్య సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అలా ఐశ్వర్య రజినీకాంత్ రజినీకాంత్ మూవీలో నటించడానికి రిజెక్ట్ చేసింది.