పునర్నవి భూపాలం అనే పేరును పున్ను, నవి, పునర్నవి అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది బిగ్ బాస్ షో. అసలు పునర్నవి భూపాలం అనే ఓ నటి, హీరోయిన్ ఉందని కూడా చాలా తక్కువ మందికే తెలుసు. అయితే బిగ్ బాస్ షో పుణ్యమా అని రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. స్టార్ హీరోయిన్‌కంటే రెట్టింపు ఫాలోయింగ్, క్రేజ్‌ను తెచ్చిపెట్టిన బిగ్‌బాస్ షో మీదే సంచలన కామెంట్స్ చేసింది.
బిగ్ బాస్ షో ద్వారా పునర్నవికి పాజిటివ్ అయింది. అంతకు ముందున్న గుర్తింపు కంటే భిన్నమైన, భారీ గుర్తింపు లభించింది. రాహుల్ సిప్లిగంజ్‌తో రహస్య స్నేహబంధం, లేడీ మోనార్క్, సిక్స్ షేడ్స్, ఇలా ఏవేవే ట్యాగ్ లైన్స్ వచ్చాయి. బిగ్ బాస్ తరువాత సినీ అవకాశాలు కూడా భారీగా పెరిగాయి. అయితే బయటకు వచ్చిన తరువాత బిగ్ బాస్ షోపై మాత్రం సెటైర్ వేస్తోంది. అందులో జరిగేది వేరు చూపించేది వేరంటూ బిగ్ బాస్‌పై ఫైర్ అయింది.24 గంటల పాటు జరిగిన దాంట్లో వారికి నచ్చిన వాటిని మాత్రమే చూపిస్తారని, నిజంగా ఏం జరిగిందో చూపించరని బిగ్‌బాస్‌పై అప్పట్లో సంచలన కామెంట్స్ చేసింది.
తాజాగా పునర్నవి మరో సెటైర్ వేసింది. ఈ మధ్య అట్టపెట్టెల కొటేషన్స్ బాగా పాపులర్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే. రోడ్డు మీద అట్టపెట్టెలు పట్టుకోవడం, వాటిపై ఏదో ఒక కొటేషన్ రాయడం క్రేజీగా మారింది. అదే క్రమంలో పునర్నవి సైతం అట్టపెట్టెలు పట్టుకుని ఉంది.అందులో ఓ అట్టపెట్టెలో ‘బిగ్‌బాస్‌లోకి వెళ్లి ఏం నేర్చుకున్నావ్ పున్ను’ అని రాసి ఉండగా.. ‘బిగ్ బాస్‌లోకి వెళ్లకూడదని’ అని ఓ ఫ్లకార్డును పునర్నవి పట్టుకుని పోజు ఇచ్చింది. ఇక ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఇదే రియలైజేషన్ (పశ్చాత్తాపం) అంటూ కామెంట్ చేసింది. మొత్తానికి బాగానే తెలుసుకుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.