వీడియో: ‘మహర్షి’‘పదరా పదరా పదరా.. ’సాంగ్

మే 9 రిలీజ్ కానున్నసూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’.రిలీజ్ సమయం దగ్గర పడటంతో…ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘ఛోటీ ఛోటీ బాతే’.. ‘నువ్వే సమస్తం’అంటూ సాగే లిరికల్ సాంగ్స్.. ‘ఎవరెస్ట్ అంచున’ అంటూ సాగే వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.

తాజాగా ఈ సినిమానుండి మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట “పదరా పదరా పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా” అంటూ స్ఫూర్తి రగిలించే విధంగా ఉండే పదాలతో శ్రీమణి సాహిత్యం అందించాడు. ఆ పాటను మీరు ఇక్కడ చూస్తూ వినచ్చు.

Padara Padara Lyrical | Maharshi Songs || MaheshBabu, PoojaHegde | VamshiPaidipally

‘మహర్షి’ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్. నరేష్‌, మీనాక్షి దీక్షిత్‌, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, పోసాని, రావు రమేశ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. దిల్‌రాజు, అశ్వినీ దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.