మారని చెత్త..దారుణ ట్రోల్స్ తో ఎన్టీఆర్, చరణ్ పరువు తీస్తున్న ఫ్యాన్స్!

RRR Movie 5 Days World Wide Collection

సౌత్ ఇండియా సినిమా దగ్గర హీరోలను తమ అభిమానులు ఎంత స్థాయిలో ఆరాధిస్తారో అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా రెండు ఫ్యాన్ బేస్ ల మధ్య ఎక్కువగా ఈ ఫ్యాన్ వార్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. హీరోలు వాళ్లలో బాగానే ఉంటారు కానీ అభిమానులు చాలా అత్యుత్సాహం అయితే చూపిస్తూ ఉంటారు.

అలాగే ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దారుణంగా ట్రోల్స్ చేసుకుంటూ వారి పైశాచిక ఆనందానికి తమ హీరోల పరువులు జాతీయ స్థాయిలో తీస్తున్నారు.

వేదికగా ఎన్టీఆర్ కి ఒక చెత్త ఎమోజి అలాగే చరణ్ కి ఒక చెత్త ఎమోజిలు వారి పేర్లతో ట్రెండ్ చేస్తూ ఇద్దరికిద్దరు ఫ్యాన్స్ పరువులు తీస్తున్నారు. ఆ ఇద్దరు RRR తో ప్రపంచ స్థాయిలో ఆదరణ అందుకుంటూ ఉంటే వీళ్ళేమో ఇలా చేస్తూ పరువు తీస్తున్నారు.

ఒకొక్కరు మళ్ళీ లక్షల్లో ట్వీట్స్ తో ఈ టాగ్ లు ట్రెండ్ చేస్తుండడం మరో షాకింగ్ అంశం. మొత్తానికి అయితే మన హీరోల పరువుని వారై అభిమానులే ఇలా నట్టేట ముంచుతున్నారు.