ఫ‌స్ట్ లుక్: 6 ప్యాక్ శౌర్యం.. విలువీరుడి జీవిత‌క‌థ‌తోనా?

సినిమా సినిమాకి ఏదో ఒక కొత్త ద‌నం వైవిధ్యం చూపించాల‌ని త‌పించే హీరోల జాబితాలో యువ‌హీరో నాగ‌శౌర్య పేరు ఉంది. అత‌డు తొలి నుంచి చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఆ సంగ‌తిని గుర్తు చేస్తుంటాయి. అయితే అత‌డు ఆశించేది ఒక‌టి అవుతున్న‌ది ఇంకొక‌టి. చాలాసార్లు రాంగ్ సెలెక్ష‌న్ బ‌య‌ట‌ప‌డింది. ఛ‌లో చిత్రం త‌ర్వాత స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ రాక ఎంతో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఎట్టి ప‌రిస్థితిలో ఇస్మార్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ లాంటిది కొట్టేయాల‌న్న పంతం అత‌డిలో అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు.

ఇదిగో ఇది అలాంటి ప్ర‌య‌త్న‌మే. స‌రిగ్గా రెండ్రోజుల క్రితం చొక్కా విప్పి బ్యాక్ లెస్ ఫోజుతో క‌నిపించాడు. గాళ్స్  తో పాటు గ‌య్స్ కూడా స్ట‌న్న‌యిపోయారు. శౌర్య‌లో ఎంత మార్పు? ఉన్న‌ట్టుండి సిక్స్ ప్యాక్ ట్రై చేశాడా? అంటూ చ‌ర్చ సాగింది. శ‌రీర‌ధారుఢ్యాన్ని అమాంతం పెంచేశాడు. ఇక అనుకున్న‌ట్టే ఈరోజు ఫ‌స్ట్ లుక్ రిలీజైంది. తాజా లుక్ లో అత‌డి 6 ప్యాక్ ఎలివేష‌న్ ఫెంటాస్టిక్ అన్న ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఆరుప‌ల‌కల దేహం కోసం అత‌డు ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశాడ‌ని అర్థ‌మ‌వుతోంది. తిండి తిప్ప‌లు లేకుండా మితాహారంతో నిరంతరం శ్ర‌మిస్తేనే ఇది సాధ్యం. ఇక 6 ప్యాక్ హీరోల జాబితాలో అత‌డి పేరు ఇప్పుడు ప‌దిలం అయ్యింది.

అన్న‌ట్టు నాగ‌శౌర్య న‌టిస్తున్న 20వ సినిమా ఇది. ఇందులో అత‌డు ఒక ఆర్చ‌ర్ (విలుకాడు)గా క‌నిపించ‌బోతున్నాడ‌ని ఈ లుక్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. అంటే క్రీడాకారుడిగా అత‌డి పాత్ర‌ను చూపించ‌బోతున్నార‌న్న‌మాట‌. ఇది బ‌యోపిక్ కేట‌గిరీనా అన్న‌ది చిత్ర‌బృందం చెబుతుందేమో చూడాలి.ఫ‌స్ట్ లుక్ తో మెప్పించాడు. కానీ సినిమాలో ద‌మ్మెంత‌? అన్న‌ది తెలియాల్సి ఉంటుంది. నారంగ్ దాస్ కె నారంగ్ ,  పి.రామ్ మోహన్ , శరత్ మరర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేతికా శర్మ కథానాయికగా న‌టిస్తోంది.