Lavanya Tripathi: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి మనందరికి తెలిసిందే. తెలుగులో పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ. మొదట అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే లావణ్య మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ సతీ లీలావతి.
ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దుర్గాదేవి పిక్చర్స్ ట్రియో బ్యానర్లపై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో దేవ్ మోహన్, లావణ్య జంటగా నటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ చిత్రం 2026 సమ్మర్ లో విడుదల కానుంది. కాగా ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఆనంది ఆర్డ్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నాగమోహన్ దీన్ని నిర్మిస్తున్నారు. కుటుంబ వ్యవస్థ బలహీనపడుతోన్న నేటి కాలంలో మనుషల మధ్య ఎమోషన్స్ కరువయ్యాయని చెప్పాలి.
ఈ నేపథ్యంలోనే రెండు వేర్వేరు కుటుంబాలు, నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు కలిసి ప్రయాణించాలంటే వారి మధ్య ఎమోషన్స్ ఇంకెంత బలంగా ఉండాలో భావోద్వేగంగా చూపించే చిత్రం సతీ లీలావతి. కాగా గత ఏడాది డిసెంబర్ 15, 2024న లావణ్య పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ను అధికారికంగా ప్రకటించగా ఫిబ్రవరి 3, 2025న రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇకపోతే ప్రస్తుతం లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. కాగా తాజాగా సతీ లీలావతి సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.