Galla Ashok: మహేష్ మేనల్లుడి కొత్త సినిమా టైటిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్!

Galla Ashok: టాలీవుడ్ యంగ్ హీరో మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందే భారీగా అభిమానులను సంపాదించుకున్నారు గల్లా అశోక్. ఇక మొదటగా హీరో అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మొదటి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకోవడం తో పాటు మహేష్ బాబు తగ్గ అల్లుడు అనిపించుకున్నారు.

అంతేకాకుండా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అశోక్. ఇప్పుడు నూతన దర్శకుడు ఉద్భవ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్ ని ఖరారు చేశారు. అంతే కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు వీసా- వింటారా సరదాగా అని టైటిల్ ని ఖరారు చేశారు మూవీ మేకర్స్. ఈ టైటిల్ ని అనౌన్స్ చేస్తూనే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో అశోక్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. వర్షంలో తడుస్తుండగా హీరోయిన్ కి షర్ట్ అడ్డం పెట్టి నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మొదటి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాలో అశోక్ మరింత స్టైలిష్ గా కనిపించబోతున్నారు అని అర్థమవుతోంది. ఇకపోతే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్ర టీజ‌ర్‌ ను రేపు అనగా జులై 12వ తేదీ శ‌నివారం ఉద‌యం 10.53 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది.