మల్టీ స్టారర్ ప్రయత్నాల్లో నాగశౌర్య.!

ఇంతవరకూ పక్కింటబ్బాయ్ ఇమేజ్‌తో సోలోగా నెట్టుకొచ్చేస్తున్న యంగ్ హీరో నాగ శౌర్య, ట్రాక్ మార్చబోతున్నాడట. త్వరలో ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటించబోతున్నాడట.

అయితే, అది స్టార్ హీరోతో కాంబో సెట్ చేసుకుంటాడా.? లేక తన రేంజ్ హీరోనే సెట్ చేస్తాడా.? అనేది తెలియాల్సి వుంది. సొంత బ్యానర్‌లోనే ఈ సినిమా రూపొందించబోతున్నాడనీ తెలుస్తోంది.

ఓ యంగ్ హీరో ఈ సినిమాని తెరకెక్కించనున్నాడట. ఆల్రెడీ స్ర్కిప్టు పనులు నడుస్తున్నాయనీ గుసగుస. ఇటీవల ‘రంగబలి’ సినిమాతో పెద్ద కాజా తినేశాడు నాగశౌర్య.

అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా సిల్లీగా ఫ్లాప్ అయిపోయింది. దాంతో, కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నాడట. పెద్దగా ప్రయోగం అని చెప్పలేం కానీ, ట్రెండ్ ఫాలో అవ్వాలనుకుంటున్నాడీ యంగ్ హీరో.

ప్రస్తుతం మల్టీ స్టారర్ మూవీస్ ట్రెండ్ బాగా వర్కవుట్ అవుతున్న సంగతి తెలిసిందేగా. ఈ ట్రెండ్‌లో వెళ్లి ట్రై చేద్దామనుకుంటున్నాడు కాబోలు.! ఆల్ ది బెస్ట్ నాగ శౌర్య.!