మెగాడాటర్ మరొకటి కమిటైంది..టైటిల్ బాగుంది

‘ఒక్క మనసు’తో హీరోయిన్ గా ఆకట్టుకోలేక పోయిన కొణెదల నీహారిక ఈ ఏడాదిలో ‘హ్యాపీ వెడ్డింగ్’అంటూ మన ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా కూడా వర్కవుట్ కాలేదు. దాంతో ఈ మెగా ఫ్యామిలీ నటవారసురాలు..ఎలాగైనా సినిమాల్లో నిలబడాలని మరో సినిమా కమిటైంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ …’ఎ లిటిల్ బర్డ్’.

ఈ సినిమాలో నీహారికకు అక్కగా శ్రియ కనిపించనుంది. ఇది అక్కా చెల్లెళ్ల చుట్టూ సాగే కామెడీ. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ (కంచె ఫేమ్) ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సుజన అనే కొత్త దర్శకురాలు ఈ సినిమాని డైరక్ట్ చేయబోతోంది. అలాగే ఈ సినిమా టైటిల్ కు ఇంగ్లీష్ టైటిల్ ఏంటని అభ్యంతరాలు వచ్చినా కథ ప్రకారం అదే కరెక్ట్ అని ఒప్పించారట. ఇక ఈ సినిమా ఇదే టైటిల్ తో వచ్చిన ఓ షార్ట్ ఫిలిం ఆధారంగా రూపొందనుంది.

కొణిదెల నీహారిక విషయానికి వస్తే…సినిమాలు ఫ్లాఫ్ కావచ్చేమో కానీ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఓ పక్క సినిమాల కోసం వైవిధ్యమయిన కథల్ని ఎంపిక చేసుకుంటూనే మరో పక్క వెబ్‌సిరీస్ లోనూ తన హవా కొనసాగిస్తోంది. ఈ సినిమాతో పాటే నీహారిక తెలుగులో ‘ఈ మాయపేరేమిటో’టైటిల్ తో మరో సినిమా చేస్తోంది . ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేసిన ప్రణీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ “నీర్వాణ సినిమాస్” ఈ సినిమాతో చిత్ర నిర్మాణం మొదలుపెడుతున్నారు.