నయనతార 2018 సంవత్సరంలో మూడు వరుస విజయాలు సాధించి అదే ఉత్సాహంతో 2019లోను వరుస పెట్టి సినిమాలు చేస్తుంది . 2019 లో విశ్వాసం చిత్రంతో హవా కొనసాగించిన నయన్ గారు ఆ తర్వాత వరుసగా మూడు ఫ్లాపులు చవి చూడాల్సి వచ్చింది.అయితే ఆమె ముందు ఎంచుకునే కథల విషయం లో క్లారిటీ తగ్గింది . ఐదు నెలలో మూడు ఫ్లాపులు ఈ అమ్మడికి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ముందుగా నయనతార నటించిన ఐరా మార్చిలో విడుదల కాగా, ఈచిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక మేలో విడుదలైన మిస్టర్ లోకల్ చిత్రంకి కూడా అదే ఫలితం దక్కింది. ఇక గత వారం విడుదలైన కొలైయుతిర్ కాలమ్ అనే మర్డర్ మిస్టరీ చిత్రం ప్రేక్షకులని అలరించలేకపోయింది. దీంతో నయన ఖాతాలో మూడు వరుస ఫ్లాపులు చేరాయి. అయితే ఆమె నటించిన సైరా చిత్రంతో పాటు విజయ్ బిజిల్, రజనీకాంత్ దర్భార్ చిత్రాలు విడుదల కావలసి ఉంది. వీటిపైన నయన్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ హిట్స్ ప్లాప్స్ ఆమె మీద ఏ మాత్రం ప్రభావం చూపటం లేదు.