వైరల్ వీడియో: ‘కూల్ కదా’ నాగ్,వెన్నెల కిషోర్

ఒకప్పుడు అక్కినేని నాగార్జున మాటీవిలో పార్టనర్ అన్న సంగతి తెలిసిందే. అయితే స్టార్ వాళ్లు తీసుకున్నాక నాగార్జున తన షేర్ ని సైతం అమ్మేసి బయిటకు వచ్చేసారు. ఆ తర్వాత ఆ ఛానెల్ లో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే సూపర్ హిట్ షో చేయలేదు. కానీ మా టీవి నెట్ వర్క్ మాత్రం ఆయన్ని వదులుకో దలుచుకోలేదు. తాజాగా నాగార్జున తో స్టార్ గ్రూప్ కోసం ఓ కమర్షియల్ యాడ్ చేసింది.

టీవి ఛానెల్స్ కు సంభందించి కొత్త సబ్ స్క్రిక్షన్ ప్యాక్ కోసం ఈ యాడ్ రెడీ చేసారు. ఈ యాడ్ లో నాగార్జున ఓ మధ్యతరగతి వ్యక్తిగా కనపించి అలరించారు. చాలా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తిగా, టిపికిల్ విలేజ్ స్లాంగ్ తో మాట్లాడుతూ కనపడి అలరించారు. ఈ యాడ్ నాగార్జన అభిమానులను బాగా అలరిస్తోంది.

Nammakam kudaradam leda saar? #CoolKada  #StarValuePack #StarMaa

అలాగే నాగార్జున డౌట్ అడగగానే షాప్ ఓనర్ గా కనిపించే వెన్నెల కిషోర్ ..కూల్ కదా అనటం కూడా నిజంగా కూల్ గా ఉంది. నాగార్జున కూల్ గా చేసే నటనకు మంచి అప్లాజ్ వస్తోంది. ఈ యాడ్ ఇనిస్టెంట్ హిట్ గా నిలిచింది. నాగార్జున ఎక్సప్రెసివ్ ఎక్సప్రెషన్స్ తెగ నచ్చేసాయి. మీరు ఇక్కడ ఆ యాడ్ ని చూడవచ్చు.