ఇండస్ట్రీ టాక్ : ఫినిషింగ్ టచ్ లలో చిరు – నాగ్ సినిమాలు..!

ప్రస్తుతం రిలీజ్ కి వస్తున్న టాలీవుడ్ సినిమాల్లో చాలా కాలం తర్వాత తెలుగు ఇద్దరు సీనియర్ హీరోల బిగ్ క్లాష్ అనేది చాలా తక్కువగానే చూసాం కానీ చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరియు అక్కినేని నాగార్జున ల కాంబో నుంచి వస్తున్న రెండు సినిమాలు ఒకే రోజు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నాయి.

మరి ఆ సినిమాలే చిరు నటించిన “గాడ్ ఫాదర్” కాగా మరో సినిమా నాగ్ నటించిన “ది ఘోస్ట్”. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలపై కూడా ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది.

దీని ప్రకారం అయితే ఈ సినిమాలకు రెండిటికీ ఇంకా షూటింగ్ బ్యాలన్స్ ఉందట. అయితే ఇది హీరోలపై కాకుండా చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లు అని తెలుస్తుంది. దీనితో ప్రస్తుతం దర్శకులు ఈ పనుల్లో బిజీ బిజీ గా ముగించే పనిలో ఉన్నారట. దీనితో ఈ చిత్రాలు ఇప్పుడు ఫినిషింగ్ టచ్ లలో ఉన్నాయని చెప్పాలి.

ఇక గాడ్ ఫాదర్ లో అయితే సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తుండగా మోహన్ రాజా దర్శకత్వం వహించారు. అలాగే నాగార్జున సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. అలాగే ఈ రెండు సినిమాలు కూడా ఈ అక్టోబర్ 5నే రిలీజ్ కి వస్తున్నాయి.