మహేష్ బాబుకి మెగాస్టార్ చిరంజీవి నుంచి ఊహించని రేంజ్ పోస్ట్.!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న ఫాలోయింగ్ కానీ క్రేజ్ కోసం కానీ అందరికీ తెలిసిందే. భారీ మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మహేష్ బాబు పుట్టినరోజు ఈరోజు ఆగస్ట్ 9 కాగా ఈరోజు అభిమానులు అయితే బయట మరియు సోషల్ మీడియాలో రచ్చ లేపేస్తున్నారు.

అయితే ఆల్రెడీ మహేష్ నటించిన సినిమాలు “ఒక్కడు”, “పోకిరి” సినిమాల రీ రిలీజ్ కి భారీ రెస్పాన్స్ వస్తుండగా ఈ స్పెషల్ డే న అనేక మంది సినీ ప్రముఖులు కూడా తమ ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే మహేష్ బాబు తో మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి తన ప్రత్యేక విషెష్ ని మహేష్ బాబుకి అందించారు. ఓ రకంగా అయితే ఇవి ఊహించనివే అని చెప్పాలి. మహేష్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాలపై మాట్లాడుతూ..

“ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు.ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ మహేష్ బాబు హ్యాపీ బర్త్ డే” అని తెలిపారు. దీనితో ఈ ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది.