Megastar Chiranjeevi: వైరల్ అవుతున్న చిరు వీడియో.. పెరట్లో ఏం చేసాడంటే.!

Megastar Chiranjeevi: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రైతులని ఉద్దేశించి ఒక స్పెషల్ వీడియో చేసి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. కొద్ది నెలల క్రితం ఆయన తమ పెరట్లో ఆనపకాయ (సొరకాయ) విత్తనాలను నాటగా.. అది పెరిగి పెద్దదై.. ఇప్పుడు కాయలను కూడా కాస్తన్నాయట. అయితే, తాను నాటిన విత్తనాలు ద్వారా వచ్చిన మొక్కను, వాటి తీగలను కాచిన ఆనపకాయలను చూసి చిరంజీవి ఆనందంలో మునిగి తేలిపోయారు. చిరంజీవి పోస్ట్ చేసిన ఆ సెల్ఫీ వీడియోలో ఆయన తెల్లటి చొక్కా ధరించి గార్డెన్లో నడుస్తూ కనిపించారు.

ఈ సందర్భంగా.. తన ఫేవరేట్ అవుట్ డోర్ యాక్టివిటీ గార్డెనింగ్ అని చెప్తూ.. చేతిలో పెరటిలో కాచిన ఆనపకాయలను తెంపి వాటిని చేతిలో పట్టుకుని రైతులకి సెల్యూట్ చేశారు. చూడండి.. ప్రకృతి ఎంత గొప్పదో! మనం చిన్న విత్తనాన్ని వేస్తే.. ఇంత పెద్ద కూరగాయలను మనకి అందించింది. ప్రకృతిలో ఎప్పుడూ ఋణపడి ఉండాలి, దానిపట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో మెలగాలి అని చిరంజీవి చెప్పారు. మార్కెట్లో కొన్నవాటికంటే..ఇలా సొంతంగా పండించిన కూరగాయలు ఎంతో రుచిగా ఉంటాయని చిరు చెప్పుకొచ్చారు.