మెగా కోడ‌లు మ‌న‌సులో మాట‌లు!

మెగా కోడలు, న‌టుడు రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటారో? తెలిసిందే. ఆరోగ్య చిట్కాలు, సామాజిక సమస్యలపై అవగాహన వీడియోలు చేస్తూ అందరికీ చేరువ‌య్యారు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన అప్‌డేట్స్ అందిస్తూ అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ఇక చెర్రీ వ్య‌క్తిగ‌త విషయాల‌ను అంతే ఉత్సాహంగా షేర్ చేస్తూ అభిమానుల్లో హాట్ టాపిక్ గా న‌లుగుతుంటారు. ఇలా మెగా కోడలిగా, అపోలో వారసురాలిగా బాధ్యతలను నిర్వర్తిస్తూ నిత్యం బిజీగా ఉంటున్నారు.తాజాగా ఉపాస‌న ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్ల‌డించారు.

వాటిలో ఎక్కువ శాతం ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలే ఉన్నాయి. ఆయుర్వేద పద్దతులు, ఆరోగ్యకర, పోషకాహార వంటలను ఎలా తయారు చేసుకోవాలో చెప్పారు. సేంద్రియ వ్యవసాయంలోని మెలుకువలు నేర్చుకున్నానన్నారు. తండ్రితో కలిసి పొలంలో పనులు చేసాన‌న్నారు. ఈ మేరకు పేడ ఎత్తిన ఫోటోలు, ఆవుకు దాణా పెట్టిన ఫోటోలను షేర్ చేసారు. పెళ్లైన కొత్తలో అత్తవారింట్లో తనకు ఏమి తోచేది కాదని, రామ్ చరణ్ ఫ్యామిలీ గురించి తెలిసినా.. ఎలా ప్రవర్తిస్తారో అని తెగ ఫీలయ్యేదాన్నని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అత్తమ్మ సురేఖ..తనను కన్న కూతురిలా చూసుకుందని, దీంతో అత్తవారింట్లో ఉన్న విషయాన్ని మరిచిపోయినట్టు తెలిపారు.

ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన కొత్తలో మాత్రం కాస్త భయం భయంగా ఉండేదన్నారు. రాను.. రాను.. తనకు అత్త (సురేఖ) ప్రతి విషయంలో ఎంతో సహాయ సహాకారాలు అందిస్తూ వచ్చినట్టు చెప్పుకొచ్చారు. తాను ఏం చేసినా అభ్యంతరం పెట్టేవాళ్లు కాదని పేర్కాన్నారు. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన తాను.. అలాంటి ఉమ్మడి కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. లాక్ డౌన్ నేప‌థ్యంలో పేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను ఉపాస‌న స్వ‌యంగా త‌న చేతుల‌తో అందించారు. అలాగే మ‌హ‌మ్మారిని ఎదుర్కునేందుకు పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో అవేర్ నేస్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles