కమేడియన్ శ్రీనివాస్ రెడ్డికి టోకరా

 
క‌మెడియ‌న్ శ్రీనివాస్ రెడ్డి త‌న పేరుతో ఫేస్‌బుక్‌లో న‌కిలీ అకౌంట్స్ క్రియేట్ చేసిన త‌న‌కు చెడ్డ పేరు తెస్తున్నారంటూ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు పిర్యాదు చేశాడు. దీంతో కేసు విచార‌ణ చేసిన పోలీసులు అమీర్ పేట ప్రాంతానికి ర‌వికిర‌ణ్‌ను అరెస్ట్ చేశారు. ర‌వికిర‌ణ్ గతంలో కొన్నాళ్లు అసిస్టెంట్‌గా ప‌నిచేశాడు. ఇత‌ను నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీలను క్రియేట్ చేసి సినిమా అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని ప‌లువురితో చాటింగ్ చేసేవాడు. ఆ క్ర‌మంలో శ్రీనివాస‌రెడ్డి న‌టించిన చిత్రాలైన గీతాంజ‌లి, జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా పేర్ల‌తో న‌కిలీ ఫేస్‌బుక్ ఖాతాల‌ను క్రియేట్ చేశాడు. కొందరు అతను నిజంగానే శ్రీనివాస్‌ రెడ్డిగా భావించి అనేక విషయాలను షేర్‌ చేసుకున్నారు. ఈ విషయం క‌మెడియ‌న్ శ్రీనివాస్‌ రెడ్డికి దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు. ఎవరో కావాలని తనపేరును వాడుకుంటున్నారని, తనకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రవికిరణ్‌ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు నిందితునికి కౌన్సెలింగ్‌ ఇచ్చి, మరోసారి ఇలాంటి నేరాలకు పాల్పడవద్దని హెచ్చరించి పంపారు.