ఫేస్‌బుక్‌ లో సరికొత్త ఫీచర్..మెసేజ్ ఇన్‌బాక్స్‌ని యాక్సెస్ చేసే సదుపాయం..?

Facebook to say goodbye to its classic look

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వంటి వాటిని ఉపయోగించే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. ఇలా కొంతమంది ఒకటి కాకుండా రెండు మూడేసి ఫేస్బుక్ అకౌంట్ లో కూడా మైంటైన్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది యూజర్లు ఫేస్బుక్ ఉపయోగిస్తున్నారు. అయితే వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఫేస్బుక్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌ తన యాప్‌లో ఓ సరికొత్త మార్పు చేయబోతోంది. త్వరలో ఎఫ్‌బీ యాప్‌లోనే మెసేజ్ ఇన్‌బాక్స్‌ని యాక్సెస్ చేసే సదుపాయం కలగనుంది.

నిజానికి ఫేస్బుక్ మెసెంజర్ రాకముందు ఫేస్‌బుక్ యాప్‌లోనే యూజర్లు మెసేజ్‌లు యాక్సెస్‌ చేసే ఫీచర్‌ ఉండేది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఫేస్బుక్ మెజెంజర్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో అందరూ వినియోగదారులు చాటింగ్ కోసం ఫేస్బుక్ మెసెంజర్ ని ఉపయోగిస్తున్నారు. అయితే ఫేస్‌బుక్‌ ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోెవడమే కాక యాప్‌లో మెసేజ్ ఇన్‌బాక్స్‌ను తిరిగి తీసుకొచ్చింది. తమ అప్లికేషన్‌లో యూజర్లకు మెసెంజర్ ఇన్‌బాక్స్‌ని యాక్సెస్‌ అందించే ఆప్షన్‌ను టెస్ట్‌ చేస్తున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది.

అంతే కాకుండా త్వరలోనే ఈ ఫెసిలిటీని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ ఇన్‌బాక్స్‌ను అందించడం ద్వారా కంటెంట్ డిస్కవరీ, షేరింగ్ మెరుగుపడుతుందని మెటా కంపెనీ . తన అభిప్రాయం వ్యక్తం చేసింది . ప్రస్తుతం ఫేస్బుక్ రోజువారి ఆక్టివ్ యూజర్ల సంఖ్య రెండు బిలియన్ల మైలురాయిని చేరుకుంది. ఈ స్థాయిలో యాక్టివ్‌ యూజర్లను సొంతం చేసుకోవడం గొప్ప విషయం. కానీ కొన్ని సంవత్సరాలుగా ఇతర సోషల్ మీడియా యాప్ లు కొత్తగా పుట్టుకురావటంతో ఫేస్‌బుక్‌ రెవెన్యూ తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో ఈ మార్పును శాశ్వతం చేయాలని, భవిష్యత్తులో ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ యాప్‌ను తిరిగి తీసుకొచ్చే యోచన లేదని మెటా పేర్కొంది.